పెద్దాయన సమీక్ష..!ముగింపు ప్రకటనేనా..!?

ఆర్‌టిసి సమస్యకు ముగింపు పలికే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా..? అంతిమ నిర్ణయం ఏం తీసుకోనుంది? అనే విషయాలపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఈ సమస్యకు ముగింపు పలికే దిశగా సీఎం కేసీఆర్‌ మరోమారు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్‌టీసీ, రవాణా శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్‌టీసీ కార్మికుల అంశంతో పాటు ఇతర అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఏం చేస్తే బాగుంటుందన్న విషయాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఆర్‌టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఈ రోజు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు కూడా వచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్‌టీసీ అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో సీఎం చర్చించి దిశానిర్ధేశం చేశారు. మరోవైపు ప్రైవేటు బస్సుల అంశంపై తదుపరి ప్రక్రియ చేపట్టాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments