భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పట్టణంలోని భారీగా గంజాయి పట్టుబడినట్టు సిఐ వినోద్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెల్లవారుజామున వాహనం  తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా రెండు కార్లు ఆపకుండా వెళ్లాయన్నారు. వాటిని వెంబడించి ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ నందు ఆపి తనిఖీ చేయగా అందులో నిషేధిత గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ గంజాయి సుమారు 100 కేజీల వరకు ఉందని దీని విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. రెండు వాహనాలలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. 

Post a Comment

0 Comments