ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య

 ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  సోమవారం చోటు  చేసుకుంది. సాయికిరణ్ అనే విద్యార్థి టేకులపల్లి మండలం కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆత్మహత్య  చేసుకునే ముందు ఒక లెెటర్ రాసి ఉంచినట్టు తెెెలుుస్తోంది. ఆ లెెటర్ లో ' మామయ్య సార్ నన్ను కొట్టిండు. కొట్టింది కాక మిమ్మల్ని మా అమ్మను తిట్టిండు. అందుకే నేను చావాలి అనుకుంటున్నాను. ఇట్లు మీ సాయి' అని రాసి ఉన్నది. సార్ కొట్టడం వల్లనే తమ కుమారుడు మనస్తాపంతో ఆత్మ హత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు, బంధువులు తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0 Comments