Tuesday, November 12, 2019

ఖమ్మం జిల్లాలో రూ.100 కోట్ల డంప్ స్వాధీనం

ఖమ్మం జిల్లాలో దొంగనోట్ల చెలామణీ ఏవిధంగా ఉన్నదో ఇప్పుడు అర్థమవుతోంది.  జిల్లాలో వేంసూరు మండలం మర్లపాడులో రద్దయిన పాత రూ.500,రూ.1000 నోట్లు అయిన దొంగ నోట్లు సుమారు రూ.100 కోట్ల విలువ గల భారీ డంప్ ను మంగళవారం పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ నోట్ల మధ్య లో చిత్తు కాగితాలు పెట్టి మధార్ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్టు కల్లూరు ఏసిపి వెంకటేష్ మీడియా తో మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరీగూడెంకు చెందిన మధార్ ముఠా కు చెందిన దొంగనోట్ల డంప్ గా గుర్తించామన్నారు. మర్లపాడు గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ నోట్ల చలామణి చేస్తున్నట్లు తెలిపారు. ఈ దొంగ నోట్ల మార్పిడికి మధార్ కు సహాయ పడుతున్న వేంసూరు మండలం చౌడవరం గ్రామానికి చెందిన గాయం వెంకటనారాయణ, కోట హనుమంతరావు, దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments:

Post a Comment