Sunday, October 27, 2019

'డబుల్‌బెడ్‌రూం' నిర్మాణం వేగం పెంచాలి: కెటిఆర్‌

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని అధికారులను, మంత్రులను కెటిఆర్‌, తలసాని, శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.  ఇందుకు ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు నిర్థిష్టమైన ప్రక్రియను వెంటనే రూపొందించాలని హౌసింగ్‌ శాఖాధికారులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు శనివారం ప్రగతి భవన్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. నిజమైన పేదవారికి ఇల్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎంపిక ప్రక్రియ రూపొందించిన తర్వాత లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో అందరి ముందు ఎంపిక చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంపీ నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయని, వీటికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదకి తయారు చేయాలన్నారు. ఆ నాలుగు జిల్లాల కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని అధికారులు వివరించారు. హైదరాబాద్‌లో ఆ ఇళ్ల నిర్మాణ పనులు చాలా చోట్ల 70 శాతానికి పైగా పూర్తయ్యాయని తెలిపారు. జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినందున వాటి లబ్ధిదారుల ఎంపికను నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హౌసింగ్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment