Saturday, October 19, 2019

ముఖ్యమంత్రి మూర్ఖత్వం వీడాలి: టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కార్యదర్శి పల్లా కొండల రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖత్వం వీడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పల్లా కొండల రావు కోరారు.శనివారం  బోనకల్లు లో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ కార్మికులకు మద్దతు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కనీసం భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పోరాటంలో గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా కేసీఆర్ ఆయన మంత్రివర్గ సహచరులు ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఏపీ సీఎం జగన్ ను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరారు. ఉద్యమం మరింత ఉధృతం కాకముందే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు.

No comments:

Post a Comment