బ్రేకింగ్ న్యూస్: చేగొమ్మ వద్ద చెట్టును ఢీకొట్టిన సూపర్ లగ్జరీ

 ఖమ్మం జిల్లాలో మరో ఆర్టిసీ ప్రమాదం ఆదివార చోటు చేసుకుంది. భద్రాచలం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు  ఖమ్మం చేేేగొమ్మ వద్ద  చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం . సుమారు 60 మంది ప్రయాణికులతో వెళుతున్న ఈ బస్సును తాత్కాలిక డ్రైవరు నడుపుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే  డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీని నడుపుతున్న డ్రైవర్ ఈ బస్సు కు తాత్కాలిక  డ్రైవర్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే  స్థానికులు  చేరుకొని  ప్రయాణికులను బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments