రేపు ఛలో..ఆర్‌టిసి సకల జనుల బహిరంగ సభ

ఉమ్మడి జిల్లాల నుంచి వేలాది మంది వెళ్లే అవకాశం
ఇప్పటికే జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అంతా సిద్ధం

ఆర్‌టిసి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 24 రోజులుగా సమ్మె చేస్తూనే ఉన్నారు. దీపావళి, దసరా పండుగలకు జీతాల్లేక కార్మిక కుటుంబాల ఇళ్లలో పండగ వాతావరణం కనిపించడని పరిస్థితి నెలకొంది.ఉద్యోగుల భవిష్యత్తును, ఆర్‌టిసి సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఖమ్మం జిల్లాలో ఇద్దరు బలిదానమవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆర్‌టిసి కార్మికులు మనస్థాపంతో చనిపోవడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది. కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇటు రాజకీయ పక్షాల నుంచి అటు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లు నియమించి బస్సులు నడుపుతోంది. ఇప్పుడు ఏకంగా ఆర్‌టిసీ రంగాన్నే ప్రైవేటు పరం చేసేందుకు  సర్వేలు చేపిస్తుంది. కార్మికులకు అండగా నిలిచిన వారిపై అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ప్రభుత్వంతో చర్చలు నడిపినా ఫలితం లేకుండాపోయింది. విషయం హైకోర్టు వరకు వెళ్లి ఇరు పక్షాల నుంచి వాదనలు వినిపిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు కూనంనేని సాంబశివరావు కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రేపు అనగా బుధవారం హైదరాబాద్‌లోని ఎల్పీనగర్‌లోని సరూర్‌నగర్‌లో సకల జనుల బహిరంగ సభ పెట్టేందుకు జేఏసీ మరియు అఖిలపక్షం నిర్ణయించాయి. 

ఉమ్మడి జిల్లాల నుంచి తరలివెళ్లనున్న వేలాది మంది కార్మికులు,నాయకులు

రేపు జరగబోయే బహిరంగ సభకు ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులు, నాయకులు, కార్యకర్తలు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమాచారం అందించారు. సరూర్‌నగర్‌ వెళ్లేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. రేపు మధ్యాహ్నాం 1 గంట లోపు చేరుకోవాలని అందర్నీ సమీకరిస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు నల్లబాడ్జీలు, రెడ్‌ షర్టులు, రెడ్‌ చీరలు, జెండాలు, బ్యానర్లు, కండువాలు కప్పుకొని సభకు ప్రయాణమవుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ,టిడిపి, ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఈ సభకు చేరుకునేందుకు ఎక్కువ మందిని తరలించేందుకు బాధ్యతలు తీసుకున్నారు. ఒక వేళ్ల పోలీసులు వాహనాలను అడ్డుకుంటే ఎక్కడిక్కడ రోడ్లను దిగ్భంధం చేయాలని, ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
రేపు రాష్ట్ర మంతా ఐఅలర్ట్‌..?
ఆర్‌టిసి సకల జనుల సమరభేరి సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా బలగాలను పెంచే అవకాశం ఉంది. ఎక్కడా హింసకు తావు లేకుండా పోలీసులు ఇప్పటికే చర్యలకు సిద్ధమవుతున్నారు. 


Post a Comment

0 Comments