నిర్బంధం ప్రయోగిస్తే..! ప్రతిఘటన తప్పదు..!

🔸️అక్రమ అరెస్టులు పోలీసుల అణచివేత కు నిరసనగా
🔸️ఖమ్మంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఆర్టీసీ సమ్మె గత 16 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, పోలీసులు అడుగడుగునా అణచివేత ధోరణి ప్రదర్శిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని ఇలాగే నిర్బంధాలు ప్రదర్శిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తిరుమల రావు, ఎల్ఐసి యూనియన్ జిల్లా నాయకులు మంకెన శేషగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం బస్ డిపో వద్ద నుండి మయూరి సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం అణచివేత ధోరణికి వ్యతిరేకంగా బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోర్టు ప్రభుత్వాన్ని కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని చెప్పినా సిఎం కెసిఆర్ మొండిగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించకుండా కార్మికులు ఆత్మహత్యలకు కారణభూతులువుతున్నారని వారు విమర్శించారు. శాంతియుతంగా  సమ్మె చేస్తున్న కార్మికులు, సంఘీభావం తెలిపిన అఖిలపక్ష పార్టీల నాయకుల పైన అక్రమంగా అరెస్టులు చేయడం కేసులు పెట్టడం హేయమైన చర్య అని వారన్నారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే మరింతగా ఉధృతంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, కళ్యాణం వెంకటేశ్వర రావు జిల్లా కమిటీ సభ్యులు వై విక్రమ్, యర్రా శ్రీనివాసరావు మెరుగు సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓటు ప్రసాదు జిల్లా సమితి నాయకులు క్లైమంట్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, జి. రామయ్య , శిరోమణి , కాంగ్రెస్ నాయకులు చోటే మియా గడ్డం లింగమూర్తి , అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments