Monday, October 21, 2019

ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా టిజెఎఫ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టుల మౌన ప్రదర్శన


ఖమ్మం నగరంలో కొనసాగుతున్న ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సోమవారం తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టిజెఎఫ్‌) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  జర్నలిస్టులు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా మౌన ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. టిజెఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రమానికి ఆ సంఘానికి చెందిన ఫ్రింట్‌, ఎలక్ట్రానికి మీడియా పాత్రికేయులందరూ మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సంబండ వర్గాలను ఏకం చేసి అన్ని వర్గాలను ఏకం చేసిన జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ  ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనే పరిస్థితి వచ్చిందన్నారు. న్యాయమైన డిమాండ్లతో 17 రోజులుగా ఆర్‌టిసి ఉద్యోగులు కుటుంబాలతో సహా సమ్మెలో పాల్గొని స్వచ్ఛందంగా పోరాటం చేస్తుంటే సిఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దౌర్భాగ్యమని  విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఆర్‌టిసి కార్మికులు మృతి చెందడం బాధాకరమని , ఖమ్మం ఖిల్లా ఉద్యమాల గడ్డ అని మరొక్క సారి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా  ప్రజలు పోరాటాలను ప్రపంచ నలమూలల వరకు చాటిచెప్పుతున్నారని పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌ ఇలానే ఆర్‌టిసి కార్మికుల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఉద్యమం మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆర్‌టిసి కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ యూనియన్‌ నుండి జర్నలిస్టులు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని, వారి పోరాటానికి తాము పూర్తిగా అండగా ఉండి వారి సమస్య పరిష్కరించే వరకూ తామూ పోరాడతామని ధైర్యం చెప్పారు. ఈ మౌన ప్రదర్శన కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఇస్మాయిల్‌, నాగేంద్ర, ఖాదర్‌ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment