అన్నం ఆశ్రమంలో కలాం జయంతి ఉత్సవాలు

ఖమ్మం పట్టణంలో అన్నం సేవా ఫౌండేషన్‌లో శనివారం వైబ్రేట్‌ ఆఫ్‌ కలాం జిల్లా కన్వీనర్‌ డా.షాదిక్‌ పాషా ఆధ్వర్యంలో కలాం జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ అంజలి హాజరయ్యారు. అన్నం సేవా ఫౌండేషన్‌ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు, మిషన్‌ నేను సైతం సమాజం కోసం చీఫ్‌ అడ్వజర్‌ షేక్‌ షకీనా, ఎంబిసి ప్రధాన కార్యదర్శి, కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బోజెడ్ల రామోహ్మన్‌, దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌. సిద్ధాసాహెబ్‌, సామాజిక సేవా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments