Tuesday, October 22, 2019

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

ఖమ్మం నగరంలోని స్థానిక రేవతి సెంటర్ లో స్కూలు బస్సుకు ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన వర్షాలకు రేవతి సెంటర్ లో రోడ్ల పై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడటంతో వాహనాలకు చాలా ఇబ్బందికరంగా మారింది . ఈ క్రమంలో స్కూల్ బస్సు రావడంతో రోడ్డు పక్కన ఉన్న బురదలో కూరుకుపోయింది. పక్కనే ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాల పై ఒరిగింది. బస్సులో స్కూల్ పిల్లలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు ఆ రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment