సత్తుపల్లికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక

నవంబర్‌ 1న బిజెపి బహిరంగ సభ

నవంబర్‌ 1న సత్తుపల్లి జెవిఆర్‌ డిగ్రీ కళాశాలలో బిజెపి బహిరంగ సభ జరగనున్నది. ఈ సందర్భంగా కేంద్ర ¬మంత్రిత్వశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యాలయం నుంచి సత్తుపల్లి బిజెపి శ్రేణులకు సమాచారం చేరింది. ఇటీవల బిజెపిలో చ ఏరిన ఉడతనేని అప్పారావు అనుచరుల చేరిక కోసం ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. వారితో పాటు భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు న్యాయవాదులు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, వ్యాపార, వర్తక, వాణిజ్య వర్గాలకు చెందిన ప్రముఖులు బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోవా లక్ష్మణ్‌, రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహనరావు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లి కేంద్రంగా బిజెపి  పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు కూసంపూడి రవీంద్ర తెలిపారు.  

Post a Comment

0 Comments