Monday, October 28, 2019

ప్రాణాలు విడిచిన మరో ఆర్‌టిసి ఉద్యోగిని

ఖమ్మంలో మహిళ కండక్టర్‌ ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో మరో ఆర్‌టిసి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది.వివరాల్లోకి వెళితే ఖమ్మం పట్టణానికి చెందిన నీరజ సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే గత 24 రోజులుగా ప్రభుత్వం ఆర్‌టిసి కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న  తీరుకు తీవ్ర మనస్థాపం చెందింది. సోమవారం తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్‌టిసి కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే నీరజ ఆత్మహత్య చేసుకుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌టిసి సమ్మె  ప్రభావంతో ప్రభుత్వం తీరుకు ఆందోళనతో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇద్దరు ఆర్‌టిసి కార్మికులు బలిదానమయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు తీవ్ర విషాధంతో  నీరజకు నివాళ్లర్పిస్తున్నారు. నీరజకు భర్త, ఒక పాప, బాబు ఉన్నారు. 

నీరజ మృతికి సంతాపం..

జిల్లాలో ఆర్‌టిసి కండక్టర్‌ నీరజ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను నిరసిస్తూ..సోమవారం వైరాలో అఖిలపక్షం నేతలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్‌టిసి ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కేసీఆర్‌కు బుద్ధి చెబుతామని వారు తెలిపారు. 

No comments:

Post a Comment