Sunday, October 27, 2019

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలో పోలీసుల తనిఖీల్లో  భాగంగా భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేస్తుండగా వేగంగా వెళుతున్న ఇన్నోవా వాహనాన్ని పోలీసులు వెంబడించగా వాహనాన్ని మార్గమధ్యలో వదిలి పారిపోయారు.  ఈసందర్భంగా విలేకర్ల సమావేశంలో పట్టణ సీఐ వినోద్‌రెడ్డి మాట్లాడుతూ తెల్లవారుజామున తనిఖీల్లో భాగంగా  భద్రాచలం శివారులో అనుమానస్పదంగా ఇన్నోవా వాహనం(ఎపి29 ఎఎం4019) వేగంగా వచ్చిందన్నారు. ఆపకుండా వెళుతుండగా  తమ వాహనంతో వెంబడించగా వాహనాన్ని మార్గ మధ్యలో వదిలి పారిపోయారన్నారు. వాహనంలో సుమారు 280 కేజీల గంజాయి ఉందని ఆయన అన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో పట్టణ ఎస్సై రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment