జెఎసి ఆధ్వర్యంలో ఇక సమ్మె మరింత ఉధృతం

ఖమ్మం నగరంలోని జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్‌టిసి కార్మికులు చేపట్టిన ఆందోళనకు అన్ని వర్గాల నుండి విశేష స్పందన లభించింది. ఆర్‌టిసి ఉద్యోగులు బస్టాండ్‌ లోని ప్రయాణికులకు పువ్వులు ఇచ్చి తమ నిరసనకు మద్దతు తెలపాలని కోరారు. ఆర్‌టిసి ఉద్యోగుల కుటుంబాలు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ప్రభుత్వానికి తమన సమస్యలను తెలుపుతూ ప్లకార్డులను చేతబూని నిరసన వ్యక్తం చేశారు. 

ఇక జెఎసి ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం...

16 రోజులుగా చేస్తున్న ఆర్‌టిసి  కార్మికుల సమ్మె రానున్న రోజుల్లో  ఇక మరింత ఉధృతం కానుంది. ఈ విషయమై జెఎసి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న అన్ని బస్‌ డిపోల ఎదుట కార్మికుల కుటుంబాలతో దీక్షలు ప్రారంభించనున్నారు. 22న తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లు ఎదుట తమ నిరసన తెలుపనున్నారు.  23న టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తులు చేయనున్నారు. 24న మహిళా కండక్టర్లు దీక్షలు ప్రారంభించనున్నారు. 25న హైవేలు, ఇతర రహదారులు దిగ్భందించనున్నారు. 26న ఆర్‌టిసి కార్మికుల పిల్లలతో దీక్షలు చేపట్టనున్నారు. 28న హైకోర్టులో సమ్మెపై విచారణ జరగనుంది. 30న భారీ సమీకరణతో బహిరంగ సభ జరగనుంది. 

Post a Comment

0 Comments