రాష్ట్రం ప్రస్తుతం చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉందని  కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న రాష్ట్ర్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నుండి కాంగ్రెస్ శ్రేణులు నుండి పూర్తి మద్దతు ఉందని తెలిపారు. రాష్ట్రంలో లో 48 వేల 500 వందల మంది  ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంమే కారణమని విమర్శించారు. ఆర్టీసీ రంగం నష్టాల బాట పట్టడానికిి కారణం సీఎం కేసీఆర్ విధానాలే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకే గత ఆరేళ్లుగా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.  త్వరలో సింగరేణి ఆస్తులను కూడా కొంత ప్రైవేటుపరం చేసేందుకు సీఎం కేసీఆర్ అంతా సిద్ధం చేశారని ఆరోపించారు. రాాష్ట్రంలో ప్రజల ఆస్తులను అమ్మేందుకు కు ఎవరికీ హక్కు లేదని  వాటిని భవిష్యత్ తరాలకు అందించాలి తప్ప నాశనం చేయకూడదని సూచించారు. టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు కార్మికుల పక్షాన నిలబడతానని చెప్పారని వారిిిిి పక్షాన సీఎం కేసీఆర్ తో చర్చలు కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ  ఇప్పుడు సీఎం కేసీఆర్ అప్పాయింట్మెంట్  ఇవ్వడం లేదనడం హాస్య స్పదంగా ఉందన్నారు. కేేేేేశవరావు ప్రత్యక్షంగాా ఆర్టీసీ కార్మికుల బంద్ లో పాల్గొని తమ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఇప్పటి కైైైన ప్రభుత్వం సమస్య లను పరిష్కరించాలన్నారు.

Post a Comment

Previous Post Next Post