Monday, October 21, 2019

బ్రేకింగ్ న్యూస్: ప్రవేటు బస్సు బోల్తా ఒకరు మృతి

 ప్రవేట్ బస్సు బోల్తా పడి ఒకరి మృతి చెందిన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద తెల్లవారుజామున చోటు చేసుకుంది. అందిన సమాచారం lమేరకు హైదరాబాదు నుండి 20 మంది ప్రయాణికులతో ఖమ్మం మీదుగా భద్రాచలం వెళుతోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున లక్ష్మీపురం వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఎల్లయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.

No comments:

Post a Comment