దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం స్థానిక ఎస్‌ఆర్‌బిజిఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో 104 బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ దుకాణాలు ఉంటాయి. దుకాణాల యజమానులు వర్షం లేకుండా ఉంటే కొనుగోళ్లు బాగుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ప్రతి ఏటా రూ.3 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా..ఈ సందర్భంగా దుకాణా నిర్వాహకులు బొల్లెపల్లి విజయ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా మంచి డిస్కౌంట్‌ ఇస్తుండటంతో తమ వ్యాపారం ఆశాజనకంగా వుంటుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌  మరియు ట్రాఫిక్‌ పోలీసుల సూచనల మేరకు విశాలమైన డిగ్రీ కళాశాల మైదానంలో దుకాణాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 

Post a Comment

Previous Post Next Post