కార్మిక సంఘాలనేతలతో శనివారం జరిగిన చర్చలపై అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా చర్చలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. రేపు కోర్టు  ప్రారంభమయ్యేలోపు పిలిచినా వెళ్తామని పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారులు శనివారం నిర్భంధం మధ్య తమతో చర్చలు జరిపారని, తమ సెల్‌ఫోన్లు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. నిన్న చర్చల నుంచి మధ్యలో తాము వెళ్లిపోలేదని..తాము అన్ని సమస్యలపై చర్చించాలని కోరామని, కాని వారు షరుతులు పెట్టి చర్చలు చేపట్టారన్నారు. చర్చల మధ్యలో నుండి అధికారులే వెళ్లిపోయారని, వీడియోలో చూస్తే తెలిసిపోతుందని తెలిపారు. బాధ్యతగల ఐఏఎస్‌ అధికారులు అబద్ధాలు చెప్పవద్దని హితవు పలికారు. ఆర్‌టిసికి సంబంధించిన డిమాండ్ల విషయమై తమ పోరాటానికి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. ఈ నెల 28 అనగా రేపు అన్ని కలెక్టరేట్ల వద్ద విజ్ఞాపన పత్రాలు అందజేస్తామన్నారు. సరూర్‌నగర్‌లో 30వ తేదీన జరిగే సకల జనుల సమరభేరికి అన్ని ఆర్‌టిసి కుటుంబాలు రాజకీయ పార్టీల నేతలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 

గులాబీ రంగుపోయి..తెల్లరంగు వచ్చె..

ఆర్‌టిసి కార్మిక సంఘం అయిన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ జెండా రంగు మారింది. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్‌ పార్టీకి అనుబంధంగా ఉంది. టిఎంయు సంఘం ఆవిష్కరింపడి నేటికి 8 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా  గులాబీ రంగు నుంచి తెల్లరంగులోకి జెండా మారింది. ఈ జెండాను ఆ సంఘం కార్యాలయంలో అశ్వత్థామరెడ్డి ఆవిష్కరించారు. 

Post a Comment

Previous Post Next Post