Core Web Vitals Assessment: 1940 lo Oka Gramam సినిమాలో గుండు కొట్టించే స‌న్నివేశంపై ద‌ర్శ‌కుడు

1940 lo Oka Gramam సినిమాలో గుండు కొట్టించే స‌న్నివేశంపై ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడంటే?

1940 lo Oka Gramam: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త గా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు ఆయ‌న‌ది. త‌న తొలి సినిమాతోనే కుల వ వ్య‌వ‌స్థ‌పై గ‌ర్జించిన ద‌ర్శ‌క సింహం ఆయ‌న‌.. త‌ను అనుకున్న ప్ర‌తి అంశాన్ని త‌న చిత్రంలో కచ్చితంగా చూపించాలి అనుకునే తెగువ ఆయ‌న‌ది… ఆయ‌నే మ‌న న‌ర‌సింహ నంది. ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యాల్లో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు మీకోసం.

1940లో ఒక గ్రామం సినిమా గురించి…

ఆ రోజుల్లో మ‌న దేశంలో కుల వివ‌క్ష చాలా దారుణంగా ఉండేది. ఎక్కువ జాతి స్త్రీని త‌క్కువ జాతి పురుషుడు ఎవ‌రైనా చూసిన‌, తాకిన‌, త‌న గురించి మాట ప్ర‌స్తావించినా కూడా చాలా దారుణంగా శిక్షించేవారు. అందులో ముఖ్యంగా నుదుటి మీద స్త్రీభ‌గ‌చిహ్నం కూడా వేసేవాళ్లు. అలాగే వీపు వెనుక తాటాకును క‌ట్టేసి, క‌నీసం ఉమ్ము కూడా ఉయ్య‌నీయ‌కుండా నోటికి చెంబు క‌ట్టేసి ఊరంతా తిప్ప‌డ‌మే కాకుండా అలాంటి శిక్ష‌లు వేస్తేనే ఇంకెవ్వ‌రూ ఇలాంటి ప‌నులు చేయ‌ర‌ని వారు అభిప్రాయ‌ప‌డ‌తారు.

అయితే అందులో ఈ గుండు కొట్టించ‌డ‌మ‌నేది చాలా చిన్న శిక్ష. ఇవ్వ‌న్నీ మ‌నం విన్న‌వే..ఇక నా ధైర్యం అంటే ఒక‌టి నాకు సినిమా(1940 lo Oka Gramam) చేసేట‌ప్పుడు త‌క్కువ కులం వాళ్లు విమ‌ర్శిస్తారనో, ఎక్కువ కులం వాళ్లు మెచ్చుకుంటార‌నో నేను ఆలోచింలేదు. జ‌రిగింది చెప్పాల‌నుకున్నాను. అందుకే ఉన్న‌ది ఉన్న‌ట్టుగా ధైర్యంగా తీయ‌గ‌లిగాను.

ఇది నా మొద‌టి సినిమా ఈ సినిమాకు నాకు జాతీయ పుర‌స్కారం వ‌చ్చింది. అది అందుకోవ‌డం చాలా సంతోష‌మే. 2006 కాలంలో బి.గోపాల్ గారి దగ్గ‌ర అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా చేశాక ఓ రూ.20 కోట్ల బ‌డ్జెట్ రేంజ్‌లో ఓ క‌థ‌ను రెడీ చేసుకున్నాను. కానీ నేను కొత్త‌వాడిని కాబ‌ట్టి ఎవ‌రికి నా మీద న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు.

అప్పుడు నేనింకా వాళ్ల‌ని వీళ్ల‌ని అడ‌గడం, వాళ్లు ఒప్పుకునేంత వ‌ర‌కు ఎదురుచూసి స‌మ‌యం వృథా చేయ‌డం స‌రికాద‌నుకున్నాను. నా మీద నాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్న‌ప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాల‌నుకొని, చ‌లం గారి సాహిత్యంలోంచి నాయుడు ప‌ల్లి అనే చిన్న క‌థ‌ను తీసుకున్నాను.

ఓ ఆరు నెల‌ల కాలం కూర్చుని స్క్రీన్ ప్లే, డైలాగులు రాసుకుని నా ఫ్రెండ్ ర‌ఘుతో క‌లిసి ఈ క‌థ‌ను ఒక రూపానికి తేవ‌డం జ‌రిగింది. ఈ సినిమాని నేను అక్క‌డా ఇక్క‌డా డ‌బ్బులు స‌మ‌కూర్చుకుని కొద్దిగా పొలం అమ్మి నాకున్న బ‌డ్జెట్లో ఓ మంచి సినిమా జనాల‌కి ఎలా అందించాలా అని ఆలోచిస్తూ స‌హ‌జంగా క‌నిపించే పాత్ర‌ల‌తో నా మొద‌టి సినిమా 1940 లో ఓ గ్రామం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం జ‌రిగింది.

ఈ సినిమాకు జాతీయ పుర‌స్కారం ల‌భించింది. కానీ నాక్కావాల్సింది అవార్డులు కాదు ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి సినిమా అందించి, నేనేంట‌నేది అంద‌రికీ చెప్పాలి. నా తండ్రికిచ్చిన మాట‌ను నెర‌వేర్చాలి అనేది నా తాప‌త్ర‌యం. ఆ మాట నెర‌వేర్చుకున్నాను కూడా. అయితే నేను సినిమాను యుద్ధం అనుకుంటాను. నా సినిమా కోసం అలాగే శ్ర‌మిస్తాను కూడా.

ఓటీటీల‌పై అభిప్రాయం?

నిజానికి సినిమా అనేది థియేట‌ర్ల‌లో చూడ‌టం వేరు, మొబైల్ ఫోన్ల‌లో చూడ‌టం వేరు. పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఆ ఎమోష‌న్స్ క‌నెక్ట్ ఔతుంటాయి. త‌ర్వాత థియేట‌ర్‌కి మ‌నం సినిమాని ఎంజాయ్ చేయ‌డానికి వెళ్తాం. అదే మొబైల్ లో అనుకోండి కాసేపు సినిమా చూస్తాం మ‌ధ్య‌లో ఏదైనా వ‌ర్క్ ఉంటే దాన్ని ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ మిగిలింది త‌ర్వాత ఎప్పుడో చూస్తాం. ఏదేమైనా థియేట‌ర్ల‌లో సినిమా చూసే ఆ ఎక్ప్సీరియ‌న్స్ వేరు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *