Gunpowder

Gunpowder: బ‌స్తాల‌కి బ‌స్తాలు పేలుడు ప‌దార్థాలు! త‌ప్పిన భారీ ప్ర‌మాదం!

Spread the love

Gunpowder: భీమ‌దేవ‌ర‌ప‌ల్లి: వ‌రంగ‌ల్ జిల్లా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ మ‌రియు పోలీసులు సంయుక్తంగా ప‌క్కా స‌మాచారంతో సోమ‌వారం దాడులు నిర్వ‌హిం చారు. ఈ దాడుల్లో అక్ర‌మంగా నిల్వ ఉంచిన 36 బ‌స్తాల్లో ఉన్న 18 క్వింటాళ్ల గ‌న్‌ఫౌడ‌ర్(Gunpowder) పేలుడు ప‌దార్థంతో పాటు ఒక ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్య‌క్తిని అరెస్టు చేయ‌గా మ‌రో వ్య‌క్తి ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు.

ఈ సంఘ‌ట‌న‌పై వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ డా.త‌రుణ్ జోషి విలేక‌ర్ల‌కు వివ‌రాల‌ను తెలియ‌జేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వ‌రంగ‌ల్ అర్బ‌న్ భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లానికి చెందిన‌ వ‌ల్లే ఐల‌య్య గా గుర్తించామ‌ని, ప‌రారీలో ఉన్న వ్య‌క్తి క‌రీంన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన పురుషోత్తంగా తెలిసింద‌న్నారు. ప‌ట్టుబ‌డిన వ‌ల్లే ఐల‌య్య వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం సాగించేవాడ‌ని తెలిపారు. దీని ద్వారా వ‌చ్చిన ఆదాయం నిందితుడుకి స‌రిపోక‌పోవ‌డంతో సుల‌భంగా డ‌బ్బు సంపాదించుకోవాల‌ని అనుకున్నాడ‌ని పేర్కొన్నారు. జిల్లాలోని క్ర‌ష‌ర్ మ‌రియు గ్రానైట్ క‌ర్మాగా రాల‌కు పెద్ద మొత్తంలో గ‌న్ ఫౌడ‌ర్ పేలుడు ప‌దార్థం అవ‌స‌రం ఉంద‌ని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఎవ‌రికీ తెలియ‌కుండా అక్ర‌మంగా గ‌న్ ఫౌడ‌ర్‌ను గ్రానైట్ క‌ర్మాగారాల‌కు విక్ర‌యించే వ్య‌వ‌హారం న‌డిపిస్తున్నాడ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు. ఇందులో పాత్ర‌దారులుగా ఉన్న అంద‌రిన్నీ విచారించి అరెస్టు చేస్తామ‌ని చెప్పారు.

మీడియాతో మాట్లాడుతున్న పోలీస్ క‌మిష‌న‌ర్ డా.త‌రుణ్ జోషి
TS News:విక‌లాంగుడిగా పుట్ట‌డ‌మే పాప‌మా..? ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పూనుకున్న ఓ వ్య‌క్తి

TS Newsవ‌రంగ‌ల్: త‌న భూమిలో అక్ర‌మంగా బోరు వేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట మంగ‌ళ‌వారం పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు Read more

rold gold haram:చెల్లి పెళ్లి అంటూ న‌కిలీ బంగారం అంట‌గ‌డుతున్న ముఠా! ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కిన వైనం!

rold gold haramవ‌రంగ‌ల్: పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని న‌కిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్ర‌జ‌ల వ‌ద్ద నుండి డ‌బ్బును సంపాదిస్తున్న ఇద్ద‌రు స‌భ్యుల ముఠాను ఇంతేజా గంజ్ పోలీసులు Read more

Warangal cp tarun joshi: డీజిల్ చోరీల ముఠా ఆగ‌డాలు పెరుగుతున్నాయి… వారి ప‌ని ప‌ట్టాలి

Warangal cp tarun joshi వ‌రంగ‌ల్: మ‌త్తు ప‌దార్థాల సేవించ‌డంతో పాటు, వాటిని త‌ర‌లించ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విధంగా గ్రామాల్లో అవ‌గాహ‌న Read more

Auto finance company:ఫైనాన్స్ కంపెనీ వేధింపులు త‌ట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవ‌ర్ ఆవేద‌న‌!

Auto finance company: త‌న‌కు, త‌న కుటుంబానికి జీవ‌నాధారంగా ఉన్న ఆటోను ఫైనాన్స్ కంపెనీ వేధింపులు త‌ట్టుకోలేక త‌న సొంత ఆటోను కాల్చేశాడు ఓ డ్రైవ‌ర‌న్న‌. ఈ Read more

Leave a Comment

Your email address will not be published.