10 Healthy Habits

10 Healthy Habits: ఆరోగ్యానికి 10 ఆహార నియ‌మాలు

Health Tips

10 Healthy Habits: ఆరోగ్య‌మ‌నేది సంప‌ద‌తో స‌మానం అనే పాత సామెత‌ను గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యా నికి కావాల్సింది ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన దిన‌చ‌ర్య‌. ముఖ్యంగా కొన్ని ప్ర‌త్యేక ఆహార నియ‌మాలు. ఆ నియ‌మాలు 10 Healthy Habits ఏంటో తెలుసుకుందాం.

Healthy Habits: 10 ఆహార నియ‌మాలు

గోరువెచ్చ‌ని నీళ్ళు తాగండి!

మీ రోజుని ఒక గ్లాసు గోరువెచ్చ‌ని నీటితో ప్రారంభించండి. దీని వ‌ల్ల మీ శ‌రీరం చ‌క్క‌గా డీటాక్స్ Detox అవుతుంది. శ‌రీరంలోని మ‌లినాల‌న్నీ విస‌ర్జించ‌బ‌డ‌తాయి. శ‌రీరం లోప‌ల శుబ్ర‌ ప‌డుతుంది. మ‌ల‌ విస‌ర్జ‌న క్రియ‌లు స‌క్ర‌మంగా సాగుతాయి. ఇలా ఉద‌య‌మే శ‌రీరంలోని మ‌లిన ప‌దార్థాల‌న్నీ విస‌ర్జించ‌డం వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గుతారు.

ఉపాహారం తీసుకోండి!

ఆఫీసుకు వెళ్ళే ముందు మంచి శ‌క్తివంత‌మైన ఉపాహారం తీసుకోండి. పీచు ప‌దార్థాలు ఎక్కువ వున్న ఓట్స్ పాల‌తో కానీ లేదా పూర్తి గోధుమ‌ల‌తో త‌యారైన బ్రెడ్ శాండ్‌విచ్ Bread sandwich కానీ, క‌డుపు నింపే స్మూతీలు కానీ ఏమైనా తీసుకోవ‌చ్చు. సెరియ‌ల్స్‌, తృణధాన్యాలు, పాలు, పాల పదార్థాలు, పండ్లు, కూర‌గాయ‌లు, న‌ట్స్‌, నూనె గింజ‌లు, ఈ కేట‌గిరీల్లో నుంచి త‌ప్ప‌నిస‌రిగా రెండు కేట‌గిరీలు ఉండేలా చూసుకోండి. మంచి ఉదాహ‌ర‌ణ‌లు పాలు (milk), ఓట్స్‌, పూర్తి గోధుమ‌ల మొల‌క‌ల‌తో త‌యారైన శాండ్‌విచ్‌ Sandwich, ఇంకొన్ని అద‌న‌పు మొల‌కెత్తిన గింజ‌లు.

మొల‌కెత్తిన గింజ‌లు తినండి!

తృణ‌ధాన్యాల‌లో ప్రోటీన్‌, పీచు ప‌దార్థం రెండూ అధికంగా ఉంటాయి. తృణ‌ధాన్యాల‌ను మొల‌కె త్తించ‌డం వ‌ల్ల పోష‌క ప‌దార్థాలు మ‌రింత ఎక్కువ అవుతాయి. మొల‌కెత్తిన గింజ‌లు, తృణ ధాన్యాలు ఆరోగ్యానికి మంచిది. వాటివ‌ల్ల బ‌రువు weight త‌గ్గుతారు. కాలేయం బాగా ప‌నిచేస్తుంది. మొహం కాంతివంతంగా మెరుస్తుంది. ఏ తృణ‌ధాన్యం నుంచైనా మొల‌క‌లు చేసుకోవ‌చ్చు. రోజుకు ఒక గిన్నెడు మొల‌కెత్తిన గింజ‌లు తిన‌డం అల‌వాటు చేసుకోండి.

మితంగా తినండి!

ఎప్పుడు తినాల‌నిపిస్తే అప్పుడు తినండి. కానీ మితంగా తినండి. మితంగా తిన‌డ‌మే ముఖ్య‌మైన సూత్రం. ఒక్క‌సారిగా ఫాస్ట్ ఫుడ్స్‌, ప్రాసెస్ట్ ఫుడ్స్ తిన‌డం ఆపేయ‌కండి. నెమ్మ‌దిగా వాటి వాడ‌కం త‌గ్గించండి. వారానికి నాలుగుసార్లు ఇది వ‌ర‌కు తింటుంటే మొద‌ట మూడుసార్ల‌కు త‌గ్గించండి. త‌ర్వాత రెండుసార్ల‌కు, ఆ త‌ర్వాత వారానికి ఒక సారికి క‌ట్టుబ‌డి ఉండండి. తీపి ప‌దార్థాలు తినా ల‌న్న కోరిక‌ను ఒక్క‌సారిగా నియంత్రించ‌లేము. పూర్తిగా తీపి ప‌దార్థాల‌ను మానేసే బ‌దులు రోజుకు మీరు తినే తీపి ప‌దార్థాల మొత్తాన్ని త‌గ్గించండి.

ఎప్ప‌టికీ పూర్తిగా తీపి ప‌దార్థాలు తిన‌కుండా ఉండాల‌ని ప్ర‌య‌త్నించకండి. అది తాత్కాలికంగా మాత్ర‌మే ప‌నిచేస్తుంది. దాని బ‌దులు తినే మొత్తాన్ని త‌గ్గించండం ద్వారా తినాల‌న్న కోరిక‌ను కొంత త‌గ్గించుకోవ‌చ్చు. అప్పుడ‌ప్పుడు తీపి ప‌దార్థాలు తిన‌డం ద్వారా మీ జిహ్వ‌ను సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చు. వాటిప‌ట్ల నియంత్ర‌ణ క‌లిగి ఉండ‌టం మాత్రం ముఖ్యం.

ఆహారంలో బ్రౌన్‌రైస్!

మీ వంటింటిలో పొట్టు తీయ‌ని గోధుమలు, బ్రౌన్ రైస్‌, గోధుమ నూక‌లాంటి వ‌స్తువులు ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. రిఫైన్డ్ చేసిన మైదా, వేపుడు ప‌దార్థాలు, తీపి ప‌దార్థాలు, కేకులు, పేస్ట్రీలు లాంటివి కేవ‌లం వీకెండ్‌లో బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే ప‌రిమితంగా తీసుకోండి.

చేప‌లు, వాట్‌న‌ట్స్ తినండి!

ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ Fatty acids, పుష్క‌లంగా ల‌భించే చేప‌ల్లాంటివి ఎక్కువ‌గా తినండి. శాఖాహారులు చేప‌ల‌కు బ‌దులు వాల్‌న‌ట్స్ (రోజుకు 3 లేదా నాలుగు వాల్‌న‌ట్స్‌) ప్లాక్స్ సీడ్స్ ( రోజుకు ఒక టేబుల్ స్పూన్‌), సోయాబీన్స్ (1/4 క‌ప్పు సోయాఫ్లోర్) తీసుకోవ‌చ్చు. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడ్డ కొలెస్ట‌రాల్‌ని త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట‌రాల్ శాతాన్ని పెంచుతాయి. అంతే కాదు ర‌క్తం గ‌డ్డ‌ క‌ట్ట‌కుండా ఆపే శ‌క్తిని క‌లిగి ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ర‌క్త‌పోటును త‌గ్గిస్తాయ‌ని కూడా కొన్ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

ఏవి ఎంత ఉండాలి?

రోజు మీరు ఎంత నీరు తాగుతున్నారో, ఎంత పంచ‌దార తీసుకుంటున్నారో గ‌మ‌నించు కుంటూ ఉండండి. మామూలు శ‌రీరానికి రోజుకి 8 గ్లాసుల నీళ్లు స‌రిపోతాయి. 1 1/2 నుంచి రెండు టేబుల్ స్పూన్ల వ‌ర‌కు నూనె వాడ‌వ‌చ్చు. రోజుకొక టేబుల్ స్పూన్ పంచ‌దార స‌రిపో తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్న వారికి రోజుకు ఎనిమిది నుంచి ప‌ది గ్లాసుల నీళ్ళు కావాల్సి ఉంటుంది. 1 నుంచి 1 1/2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక‌టి నుంచి 1 1/2 టేబుల్ స్పూన్ల పంచ‌దార స‌రిపోతుంది.

ఆహారాన్ని న‌మిలి తినండి

ఆహారాన్ని Food, ఎప్పుడూ న‌మిలి తినండి. ఆహారాన్ని న‌మిలి తిన‌క‌పోతే అరుగుద‌ల స‌రిగ్గా ఉండ‌దు. ఆహారాన్ని ముప్పై రెండుసార్లు న‌మిలి తినాల‌న్న‌ది పాత సామెత‌. దీనిని తు.చ. త‌ప్ప‌క పాటించ‌గ‌లిగితే అంత‌క‌న్నా మేలు మ‌రొక‌టి ఉండ‌దు.

ఎక్స‌ర్‌సైజ్ చేయండి!

ఎక్స్‌ర్‌సైజ్ అనేది కేవ‌లం ఆట‌లు ఆడేవాళ్ళ‌కు, కండ‌లు పెంచేవాళ్ళ‌కు మాత్ర‌మే కాద‌ని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యం కోసం ఎక్స‌ర్‌సైజ్‌ని మించింది లేదు. ఎక్స‌ర్‌సైజ్ Exercise, ల వ‌ల్ల కండ‌లు పెరుగు తాయి. శ‌రీర సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఇత‌ర‌త్రా ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఏయే ప‌నుల వ‌ల్ల ఎన్ని క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయో తెలుసుకుందాం.

యాక్టీవిటీ నిమిషానికి క్యాల‌రీల ఖ‌ర్చు

ప‌డుకొని ఉంటే 1

బ‌ట్ట‌లు ఉత‌క‌డం, టైల‌రింగ 2

ఇల్లు చిమ్మ‌డం, తుడ‌వ‌డం,

బ‌ట్ట‌లు ఇస్త్రీ చేయ‌డం 2.2

గంట‌కు 5 కి.మీ. వేగంతో న‌డ‌క 3

షాపింగ్ 3

ఇల్లు శుభ్రం చేయ‌డం 3.6

తోట‌ప‌ని 5

డ్యాన్స్ చేయ‌డం 5

వేగంగా న‌డ‌వ‌టం 5.6

టెన్నిస్ ఆడ‌టం 6

ర‌న్నింగ్ (వేగాన్ని బ‌ట్టి) 10 నుంచి 25

10 Healthy Habits: నిద్ర‌కు రాజీప‌డ‌కండి!

మీ రోజువారీ కార్య‌క్ర‌మాలు ఏమైనా స‌రే, ఎన్ని గంట‌లు ప‌ని ఉన్నాస‌రే, మీ నిద్ర Sleep, ద‌గ్గ‌ర మాత్రం రాజీప‌డ‌కండి. ప్ర‌తి రోజూ 6 నుంచి 8 గంట‌ల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా నిద్ర‌పోండి. శ‌రీరానికి, మెద‌డుకి కూడా నిద్ర ఓ మందులాంటిది. అన్నింటికంటే ముఖ్యంగా వీలైనంత న‌వ్వుతూ, సంతోషంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించండి. న‌వ్వ‌డం ఒక భోగం, ఆరోగ్యం కూడా.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *