Garikapadu check post : గరికపాడు చెక్‌పోస్టువద్ద పట్టుబడిన కోటి రూపాయలుJaggaiahpet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తు్న సుమారు కోటి రూపాయల నగదు ను చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారును గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీల కోసం నిలిపారు. కారును తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేని సుమారు కోటి రూపాయలు పట్టుబడటంతో చిల్లకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక పంచాయతీ ఎలక్షన్ల నేపథ్యంలో సరిహద్దు దాటుకొని ఆంధ్రాలోకి ఇంత డబ్బును తీసుకురావడం చర్చనీయాంశం మైంది. ఇది ఎన్నికల కోసమా? లేకా హవాలా డబ్బులా? ఇంకా తెలియాల్సి ఉంది. ఇంత డబ్బును ఆంధ్రాకు తీసుకువస్తున్న కారు యజమానిని చిల్లకల్లు పోలీసులు విచారిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


ఇది చదవండి:పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో దాడిఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్