ఒడిస్సా(Odisha) : ఆమె..డాక్టర్ బృంద ఐఏఏస్. కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె..! కాస్తోకూస్తో జనం కోణంలో ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్..!అదసలే ఒడిస్సా..బీమారు రాష్ట్రాల్లో ఒకటి. అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి. అనేక గ్రామాలకు అసలు రోడ్లే ఉండవు. చదువు అసలే ఉండదు. వైద్య అందదు.. ఆమె ఒక రోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది. ఆ వార్త సంపూర్ణంగా చదవింది. వివరాలు తెప్పించకున్నది. ఓ కలెక్టర్గా సిగ్గు పడింది. ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా..!అని తలవంచుకుంది. డ్రైవర్ను పిలిచింది. గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది. డ్రైవర్ పరేషన్ అయ్యాడు. ఆమె కారులో బయల్దేరింది. ఆ ఊరు చేరుకున్నది. ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు? అని అడిగింది. అప్పుడు ఆ మట్టి మనిషి కథ ప్రారంభమైంది.
కొత్తగా జిల్లాకు రాగానే 10 రోజులు హంగామా హైరానా చేసి ప్రజలలో మంచిపేరు సంపాదించుకొని ఆ తర్వాత యదాతాదంగా మారిపోయే కలెక్టర్లు ఉన్న ఈ సమాజంలో ఇలాంటి మానవత్వం, మంచితనం, ప్రజల గురించి ఆలోచించే కలెక్టర్టు వందకో.. వెయ్యికో ఒకరు అరుదుగా కనబడతారు.
ఆయన వయస్సు 45 . పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు..ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంజీ కథ తెలుసు కదా..సేమ్ , ఆయన ఒడిస్సా మాంజీ ..ఎందుకో తెలుసా? తనూ అంతే ..ఆ ఊరికి రోడ్డు లేదు.. నిజం చెప్పాలంటే? కరెంటు కూడా లేదు. మంచినీటి సరఫరా ఆశించేదే లేదు. ఒక్కొక్కరు ఊరు విడిచి వెళ్లిపోయారు. ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్…ఎందుకు? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే.. ఎవరినీ ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయే…లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయే.. అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు. ఈ అధికారులు అని అర్థమైంది.. దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు.. కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా..? భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది. ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు..రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు.
ఇవి చదవండి : ప్రైవేటీకరణపై డివైఎఫ్ఐ ఆందోళన..!రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటా పోతున్నాడు. మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్. ఒక్కడూ సహకరించినవాడు లేడు. అయితేనేం? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు.రెండేళ్లు కష్టపడ్డాడు. నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు. 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు. ఓ రోజు గుండెలో తడి ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు. అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది. ఆమె చదివింది. ఆమె కళ్లు చెమర్చాయి. ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదా అనే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది. అందుకే ఆ ఊరికి బయల్దేరింది. అతన్ని కలిసింది..మాట్లాడింది. ఏం లేదు మేడమ్.. మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను అన్నాడు జలంధర్. ఆమె మరింత సిగ్గుపడింది. ఓ సారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది.
ఇవి చదవండి : కరోనా వచ్చిందని బైక్ కాల్చేసిన యజమానిఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది. ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది. ఆయ్యా.. మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకుంది. మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలేయ్ అని చెప్పింది. తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది. ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది. ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది. అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి. మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది. మరో విషయం..ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వడానికి కూడా ఆమె అంగీకరించింది. నిజంగా ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే.. ఇవి కదా పది మందికి స్ఫూర్తినిచ్చే అసలు విజయగాథలు.. అంటే..!