![]() |
drugs |
tollywood drugs case హైదరాబాద్: దేశ చరిత్రలో మత్తుమందు(డ్రగ్స్) వల్ల సినీ పరిశ్రమల్లో పొగరాజుకుంటోంది. ఎప్పుడు ఎవరి పేరు వస్తుందోనని టెన్షన్ టెన్షన్ మొదలైంది. కొన్ని నెలలుగా డ్రగ్స్ విక్రయాల వ్యాపారం గుట్టు రట్టవ్వడంతో సినీ ప్రముఖులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే బాలివుడ్లో అగ్గి రాజుకున్న డ్రగ్స్ కలకలం తాజాగా మళ్లీ తెలుగు పరిశ్రమకు తాకింది.
ఇక టాలీవుడ్ లో ఇప్పటికే డ్రగ్స్(drugs case)కేసు లో పలువురి పేర్లు బయటకు రావడం విచారణకు హాజరు అవ్వడం జరిగింది. ఈ కేసు మూడేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు పురోగతిపై సుపరిపాలన వేదికగా సమచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఈ నెల 1న ఆబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు 8 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశామని మిగతా వాటిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని తెలిసింది. చాలా మంది సినీ హీరోలకు,హీరోయిన్లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై వారందర్నీ పిలిచి విచారించిన కేసులో మూడేళ్లయినా దర్యాప్తు కొలిక్కి రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2017 జూలై 2న సికింద్రాబాద్కు చెందిన కెల్విన్ మాస్కెరాన్స్(29), చాంద్రాయణగుట్ట ఇస్మయిల్నగర్కు చెందిన సోదరులు ఎండీ అబు్దల్ వహాబ్(20), ఎండీ అబ్దుల్ ఖుద్దూస్ (20)లను అరెస్టు చేశారు. వీరు ఖరీదైన మత్తుమందులు దిగుమతి చేసుకొని హైదరాబాద్లో అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుండి 700 యూనిట్లు ఎల్ఎస్డీ, 35 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా కెల్విన్ వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. పాఠశాల విద్యార్థులు మొదలు టాలీవుడ్ లో అనేక మంది ప్రముఖులకు మత్తుమందులు సరఫరా చేసేవాడినని కెల్విన్ చెప్పడంతో కలకలం రేగింది. దాంతో అబ్కారీ అధికారులు మొత్తం 12 మందిని రోజుకు ఒకరి చొప్పున పిలిపించి విచారించారు.
![]() |
drugs case |
12 కేసులు నమోదు..8 కేసులు విచారణ..!
అబ్కారీ అధికారులు 12 కేసులు(tollywood drugs case) నమోదు చేయగా..ఇప్పటి వరకు 8 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 62 మందిని విచారించారు. మత్తు మందులు సరఫరా చేసిన వారికి సంబంధించిన కేసుల్లో మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేశారు. వారు ఎక్కడెక్కడ నుంచి తెచ్చేవారు. ఎలా తయారు చేసేవారన్న విషయాలను అందులో పేర్కొన్నారు. కొందరు స్థానికంగానే మత్తుమందులు తయారుచేసినట్టు అభియోగపత్రాల్లో వెల్లడించారు. మరికొందరు నిందితులు జర్మనీ, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ నుంచి కొరియర్ ద్వార దిగుమతి చేసుకున్నట్టు పేర్కొన్నారు. స్థానికంగా జరుగుతున్న గంజాయి, ఇతర మత్తు మందులు రవాణా వంటి అంశాలనే ఈ అభియోగపత్రాల్లో ప్రస్తావించారు. వీటిలో ఎక్కడా సినీతారలకు సంబంధిచిన ప్రస్తావన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.