ఒడిస్సా : అపారమైన సాంస్కృతిక, పర్యావరణ ప్రాముఖ్యత ఉన్న కార్లపట్ అడవులలో భాగమైన ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం మట్టి పరీక్ష చేయడాన్ని ఆదివాసీ కార్యకర్తలు(Odisha Tribal life) వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి మధ్య ప్రపంచం గమనం మందగించడంతో భారత దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ జనాభా తమ ఉనికికి, జీవనోపాధికి ముప్పు కలిగించే గని తవ్వకాల కార్యకలాపాలను ఆపడానికి చాలా కష్టపడుతున్నారు. స్థానిక ప్రజల నుంచి నిరంతరాయంగా నిరసనలు ఎదురవుతున్నప్పటికీ గనుల తవ్వకం ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.ఒడిస్సాలోని లోతట్టు ప్రాంతమైన ఖండువల్ మాలిలో, బాక్సైట్ మైనింగ్ కోసం మట్టిని పరీక్షించడానికి వ్యతిరేకంగా ఆదివాసీలు పోరాడుతున్నారు. బాక్సైట్ మైనింగ్ తీవ్రమైన పర్యావరణ పరిణామాలను కలిగిస్తోంది. నీటి ప్రవాహాలు ఎండిపోయి భారీ కాల్యుష్యానికి దారి తీస్తుంది. అలాగే, కార్పొరేట్ సంస్థల ఉనికి గిరిజనుల జీవితాలను, సంస్కృతిని నాశనం చేస్తుంది.
కార్లాపట్ అడవి నడిబొడ్డున ఉన్న ఖండూవల్ మాలిలో ఎక్కువ భాగం కార్లాపట్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. ఈ ప్రాంతాన్ని కొంధర్ దేవత నివాసముండే పవిత్ర పర్వతంగా స్థానిక ఆదివాసీలు భావిస్తారు. ఇక్కడ ఖండూవల్ జలపాతం కూడా ఉంది. ఇటీవల ఖండువల్మాలి సురక్ష సమితి బ్యానర్ క్రింద కార్యకర్తలు తమ నిరసనను తెలియజేయడానికి 60 గ్రామాలలో ఒక పాదయాత్ర నిర్వహించారు. ఆ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆదివాసీలపై దుర్మార్గంగా దాడికి తెగపడ్డారు. అయితే స్థానిక మహిళల నుండి పోలీసులకు ఎదురైన ప్రతిఘటన వల్ల వాళ్లు వెన్కి తగ్గక తప్పలేదు.
పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త స్వాతి మాట్లాడుతూ ‘లాక్డౌన్ సమయంలో, బాక్సైట్ మైనింగ్‌ను పరీక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మేము 60 కి పైగా గ్రామాలకు వెళ్లాము. ఈ ప్రాంతంలో బాక్సైట్ సమృద్ధిగా ఉంది, కానీ ముఖ్య విషయం ఏమిటంటే జిల్లాలో అపారమైన ఆకుపచ్చని పాచెస్, గొప్ప అడవులు ఉన్నాయి. వృక్ష, జంతుజాలంతో సమృద్ధిగా ఉంది. మైనింగ్ ప్రక్రియను ప్రారంభించడం మా జీవనోపాధికి భారీ ముప్పు.’ అని అన్నారు. ఇక వారు తప్పించుకోలేరు…!
‘ఇది చాలా సుదూర ప్రాంతం కావడంతో లాక్డౌన్ సమయంలో వైరస్ గురించి అవగాహన లేదు. కానీ పెరిగిన వస్తువుల ధరల ప్రభావం వీరిపై పడింది. విపత్తు సమయంలో కూడా మట్టి పరీక్షా ప్రక్రియను ప్రారంభించడాన్ని వ్యతిరేకించినందుకు గతంలో అరెస్టు అయి వేధింపులు, హింసకు గురైన కమిటీ సభ్యులు బ్రిటీష్ కుమార్ ఇంటికి, మైనింగ్ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. గనుల తవ్వకానికి గ్రామసభ అనుమతి ఇవ్వలేదు.’
‘ఈ ప్రాంతం లాంఝిఘర్కు ఎదురుగా ఉంది. చిరుత పులులు, ఏనుగులు వంటి అంతరించిపోతున్న అనేక జాతులకు ఈ అడవి ఒక ముఖ్యమైన నివాసం’ అని పోస్కో ప్రతిరోద్ సంగ్రామ్ సమితి(పిపిఎస్ఎస్) ప్రతినిధి ప్రశాంత పైక్రే అన్నారు.
‘బాక్సైట్ మైనింగ్ చేపట్టాలనే వేదాంత కంపెనీ ప్రతిపాదనకు నిరనసగా తెలియజేయడానికి ఖండూవల్ మాలిలోని నియామ్‌గిరి సురక్ష సమితి, ఖండ్యూవల్ మాలి సురక్ష సమితి చేసిన పాదయాత్ర కీలకమైన మార్గం. ఈ భూమిని ఏ కార్పొరేట్ సంస్థ స్వాధీనం చేసుకుంటుందో మాకు పూర్తిగా తెలియదు. కానీ మైనింగ్ కు దారితీసే ఏ చర్యనైనా మేము అడ్డుకోవాలనుకుంటున్నాం. గతంలో మైనింగ్ కంపెనీలైన బిహెచ్పి, ఎల్ అండ్ టి వంటి బాక్సైట్ కోసం ఈ పర్వతాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాయి. ప్రభుత్వం కూడా కార్యకర్తలను నిర్భంధించడం ద్వారా ఖండువల్ మాలి ఉద్యమాన్ని దారుణంగా అణచివేయడానికి ప్రయత్నించింది.’ అని ఆయన అన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ