ధైర్యంగా ఉండు..నీకేం కాదు క‌న్నా..!

Rajinikanth
Rajinikanth

అభిమానికి ధైర్యం చెప్పిన సూప‌ర‌స్టార్ ర‌జ‌నీకాంత్‌
చెన్నై: ‘నీకేం కాదు..ధైర్యంగా ఉండు.. అనారోగ్యం నుంచి త్వ‌ర‌లోనే కోల‌కుంటావు. కుటుంబ స‌మేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను.’ ఈ మాట‌ల్ని అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్న త‌న అభిమానిలో ధైర్యాన్ని నింప‌టానికి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ చెప్పిన మాట‌లివి. భాషాకు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విష‌యం తెలిసిందే. వారంతా ఆయ‌న్ని రాజ‌కీయ నాయ‌కుడిగా చూడాల‌ని ఎన్నాళ్లుగానో ఆశిస్తూ ఎదురుచూస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ కూడా క‌రోనా కార‌ణంగా షూటింగ్‌లు రద్దు కావ‌డంతో ఇంట్లోనే ఉంటూ త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న రాజ‌కీయ పార్టీ గురించి సుదీర్ఘ చ‌ర్చ‌ల్లో బిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ర‌జ‌నీకాంత్ వీరాభిమానుల్లో ఒక‌రైన ముర‌ళి అనే అత‌ను క‌రోనా వ్యాధితో ముంబైలోని ఒక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇత‌నికి యూరిన్ స‌మ‌స్య కూడా ఉండ‌టంతో ఆరోగ్యం విష‌యంగా మారింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. 
ఈ విష‌యం తెలుసుకున్న ర‌జ‌నీకాంత్ అత‌నికి ఒక వీడియోను పంపారు. అందులో ‘ ముర‌ళి నేను ర‌జ‌నీకాంత్‌ని మాట్లాడుతున్నాను. నీకేం కాదు.. క‌న్నా. ధైర్యంగా ఉండు నేను భ‌గ‌వంతుడ్ని ప్రార్థిస్తున్నాను. త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వ‌స్తావు. ఆ త‌ర్వాత ద‌య‌చేసి కుటుంబంతో స‌హా మా ఇంటికి రావాలి. నేను మిమ్మ‌ల్ని చూస్తాను.’ అంటూ ర‌జ‌నీకాంత్ త‌న అభిమానికి  ధైర్యం చెప్పారు. 
Rajanikanth 

చ‌ద‌వండి :  స్టార్ట్ కెమెరా..షూటింగ్ రెడీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *