ఆరోగ్య‌మే.. మ‌హాభాగ్య‌ము..!

ప్ర‌పంచంలో స‌మ‌స్త జీవ‌రాసుల‌తో పాటు మ‌నిషి శారీర‌కంగాను, మాన‌సికంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను, తాను ఉన్న ప‌రిస‌రాల‌లో హాయిగా ప్ర‌శాంతంగా జీవించ‌డాన్ని ఆరోగ్యం అంటారు. ఆరోగ్య‌ము మ‌నిషి ప్రాథ‌మిక హ‌క్కు. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ప్ర‌య‌త్నించాలి. మంచి ఆరోగ్య ప‌రిస‌రాల‌ను, ప‌రిస్థితుల‌ను క‌ల్పించుకోవాలి. ఆరోగ్య‌ముగా ఉండ‌మ‌ని ప్ర‌తిఒక్క‌రికీ సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాలి.

ఆరోగ్యంగా ఉండే వారి శారీర‌క ల‌క్ష‌ణాలు..

బ‌రువు(వ‌య‌స్సు ప్ర‌కారం), శారీర‌క ఉష్ణోగ్ర‌త‌, గుండె ల‌య‌(హార్ట్‌బీట్‌), నాడీ ల‌య‌(ప‌ల్స్‌రేట్‌), ర‌క్త‌పోటు(బ్ల‌డ్ ప్రెష‌ర్‌), మూల జీవ‌క్రియ రేటు(బేస‌ల్ మెట‌బాలిక్ రేటు) ..ఇవ‌న్నీ ఆరోగ్య‌వంతుడికి ఉండే శారీర‌క ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఆరోగ్యం కొర‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త‌లు..

పౌష్టికాహారం, స‌మ‌తుల్యాహారం, శారీర‌క వ్యాయ‌మం, మానసిక వ్యాయామం, ధ్యానం.

ఆరోగ్య‌మే ప్ర‌ధానం…

దేశాభివృద్ధి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్య‌మైన‌ది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డబ్ల్యుహెచ్ఓ) ఆరోగ్యం అంటే..శారీర‌క, మాన‌సిక‌, సాంఘిక‌, ఆధ్యాత్మిక కుశ‌ల‌త‌, అంతే కాని కేవ‌లం ఏదైనా ఒక వ్యాధి గాని లేక వైక‌ల్యం గాని లేక‌పోవ‌డం మాత్ర‌మే కాదు..అని అర్థం వ‌స్తుంది. ఒక వ్య‌క్తి (అత‌నులేక ఆమె) యొక్క సామ‌ర్థ్యాన్ని గురించి తెలుసుకుని ఉండ‌టం, జీవితంలో సంభ‌విస్తూ ఉండే సాధార‌ణ శ్ర‌మ‌, ఒత్తిడికి త‌ట్టుకొని ఉండ‌గ‌ల‌గ‌డం, ఉత్పాద‌క శ‌క్తితో ప‌నిచేయ‌గ‌లిగి ఉండ‌టం, అత‌ను లేక ఆమె జాతికి త‌న వంతు తోడ్పాటును అందించ‌డంతో ఉండే మాన‌సిక ఆరోగ్యాన్ని ఒక మ‌నో-కుశ‌ల‌త‌గా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ‌ర్ణిస్తుంది. ఇటువంటి వాస్త‌విక దృష్టితో చూసిన‌ప్పుడు, మాన‌సిక ఆరోగ్యం అనేది ఒక వ్య‌క్తి యొక్క మాన‌సిక శ్రేయ‌స్సుకు పునాది వంటిది. వ్య‌క్తి స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డేది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *