Saturday, July 25, 2020

July 25, 2020

డిప్యూటీ సీఎం తొలి సంత‌కం: ఇక‌ బియ్యం కార్డే ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్‌..!

అమ‌రావ‌తి: ఆదాయ‌ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్‌) కాల‌ప‌రిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అలాగే బియ్యం కార్డు దారుల‌కు ఇక‌పై ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని, ఆ కార్డు వారి ఆదాయానికి కొల‌మానంగా పేర్కొంటూ మ‌రో నిర్ణ‌యం  కూడా తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర రెవెన్యూ , స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డుతూ ఆ రెండు ఫైళ్ల‌పై ఉప‌ముఖ్య‌మంత్రి  ధ‌ర్మాన కృష్ణ‌దాస్ శ‌నివారం సంత‌కం చేశారు. స‌చివాల‌యంలో అయిదో బ్లాక్‌లో రాష్ట్ర రెవెన్యూ స్టాప‌ర్స్ మ‌రియు రిజిస్ట్రేష‌న్ల శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా బియ్యం కార్డుదారుల‌కు ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ మిన‌హాయింపుతో పాటు ఏడాది నుంచి నాలుగేళ్ల‌కు ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ కాల ప‌రిమితి గ‌డువు పెంపుపై ఆయ‌న త‌న తొలి సంత‌కం చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి త‌న‌కు కీల‌క‌మైన రెవెన్యూ, స్టాప‌ర్స్  మ‌రియు రిజిస్ట్రేష‌న్ల శాఖ అప్ప‌గించార‌న్నారు. త‌న‌పై ఆయ‌న ఉంచిన న‌మ్మ‌కానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 
సీఎం ఆశ‌య సాధ‌న మేర‌కు త్రిక‌ర‌ణ శుద్ధిగా ప‌నిచేస్తూ, రెవెన్యూ శాఖ‌లో ఉన్న స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారుల సాయంతో పార‌దర్శ‌క మైన సేవ‌లు అందిస్తాన‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అన్ని వ‌ర్గాల‌కూ స‌మ‌తుల్య‌త పాటిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు స‌హా అయిదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవ‌కాశ‌మిచ్చార‌న్నారు. త‌న ఏడాది పాల‌న‌లోనే దేశంలో అత్యుత్త‌త‌మైన  ముఖ్య‌మంత్రుల్లో సీఎం జ‌గ‌న్ నాల్గో స్థానంలో నిలిచార‌ని కొనియాడారు. దిశ చ‌ట్టం, ప్రైవేటు ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు వంటి ఎన్నో వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక స్థానం పొందార‌న్నారు. భూ వివాదాల ప‌రిష్కారానికి త్వ‌ర‌లో భూ స‌ర్వే చేప‌ట్టనున్న‌ట్టు డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ తెలిపారు.  
దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్క‌రాలు...
రెవెన్యూ శాఖ‌లో ఉన్న ధీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారాలు చూపాల‌ని ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆదేశించారు.  మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న సంబంధిత శాఖాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని త‌న ఛాంబ‌ర్‌లో నిర్వ‌హించారు. భూ త‌గాదాల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం త్వ‌ర‌లో భూ రీ స‌ర్వే చేప‌ట్టనుంద‌ని  ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఉషారాణి  డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

July 25, 2020

కాల్పుల క‌ల‌క‌లం.. ఇన్‌స్పెక్ట‌ర్‌ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌..!

న్యూఢిల్లీ:
దేశ రాజ‌ధాని లోని సీఆర్‌పీఎఫ్ 122వ బెటాలియ‌న్‌లో కాల్పులు క‌ల‌క‌లం చోటుచేసుకున్నాయి. ఇన్‌స్పెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్‌సింగ్‌(56) ను ఎస్ ఐ క‌ర్నేల్ సింగ్ (55) కాల్చి చంపారు. అనంత‌రం ఎస్ఐ క‌ర్నేల్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న లోధి ఎస్టేట్‌లోని హోంమంత్రి భ‌వ‌నం వ‌ద్ద శుక్ర‌వారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్ స్పెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ సింగ్‌, ఎస్ఐ క‌ర్నేల్ సింగ్ మ‌ధ్య శుక్ర‌వారం రాత్రి తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఆగ్ర‌హంతో ఎస్ఐ త‌న స‌ర్వీస్ గ‌న్‌తో ఇన్ స్పెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ సింగ్ పై కాల్పులు జ‌రిపారు. దీంతో ద‌శ‌ర‌థ్ సింగ్ అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. అనంత‌రం అదే గ‌న్‌తో ఎస్ఐ క‌ర్నేల్ సింగ్ త‌న‌ను తాను కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు కోణాల్లో లోతుగా ద‌ర్య‌ప్తు జ‌రుపుతామ‌ని పోలీసులు తెలిపారు. ఎస్ ఐ క‌ర్నేల్ సింగ్ జ‌మ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందిన వారు కాగా, ఇన్ స్పెక్ట‌ర్ ద‌శ‌రథ్ సింగ్ హ‌ర్యానాలోని రోహిత్ క్ కు చెందిన వార‌ని పోలీసులు పేర్కొన్నారు. 

న‌ర‌కం భ‌రించ‌లేక‌..

క‌న్న‌కొడుకునే చివ‌రికి ఇలా..!

తెనాలి: మ‌ద్యం తాగేందుకు డ‌బ్బు ఇవ్వ‌మ‌ని ఆ కొడుకు రోజీ పీడిస్తూ..కొడుతుండ‌టంతో ఇక ఆ తండ్రి భ‌రించ‌లేక‌పోయాడు. తీవ్ర ఆవేద‌న‌, కోపంతో క‌న్న కుమారుడ్నే ఇంట్లో ఉన్న క‌త్తి తో పొడిచి హ‌త‌మ‌ర్చాడు. ఈ ఉదంతం గుంటూరు జిల్లా, తెనాలిలో గురువారం అర్థ‌రాత్రి చోటుచేసుకుంది. తెనాలిలో మూడో ప‌ట్ట‌ణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం.. ప‌ట్ట‌ణంలోని పాండురంగపేట‌కు చెందిన దుద్దుకూరు సీతాప‌తి ఒక హోట‌ల్‌లో ప‌నిచేస్తున్నారు. ఈయ‌న భార్య గృహిణి.. ఈ దంప‌తుల ఇద్ద‌రు కుమారులు క్యాట‌రింగ్ ప‌నుల‌కు వెళుతుంటారు. చిన్న కొడుకైన జ‌గ‌దీష్‌(28) మ‌ద్యానికి తీవ్రంగా బానిస‌గా మారాడు. గ‌త 5 ఏళ్లుగా ఇత‌ను రోజూ మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చి త‌ల్లిదండ్రులు, సోద‌రుడితో గొడ‌వ‌ప‌డేవాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో కొన్ని నెల‌లుగా ప‌నులు లేనందున ఇత‌న మ‌ద్యం తాగేందుకు డ‌బ్బు ఇవ్వ‌మ‌నిరోజూ త‌ల్లిదండ్రుల‌ను వేధిస్తూ, వారిని కొడుతున్నాడు. గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఇంటికొచ్చిన జ‌గ‌దీష్ సోద‌రుడితో గొడ‌వ ప‌డి వెళ్లిపోయాడు. తిరిగి అర్థ‌రాత్రి వ‌చ్చి మ‌రోమారు ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. న‌చ్చ‌చెప్ప‌బోయిన త‌ల్లిని తీవ్రంగా కొట్టాడు. స‌హ‌నం కోల్పోయిన తండ్రి సీతాప‌తి కూర‌గాయ‌లు కోసే క‌త్తితో జ‌గ‌దీష్‌ను పొడిచాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో అత‌ను సంఘ‌ట‌న స్థ‌లిలోనే మృతిచెందాడు. పోలీసులు సీతాప‌తిని  అదుపులోకి తీసుకున్నారు. 


July 25, 2020

క‌రోనా మిగిల్చిన బాధ: బిల్లు 15 ల‌క్ష‌లు..ద‌క్క‌ని ప్రాణం..!

నారాయ‌ణపేట : ఆయ‌న నారాయ‌ణ పేట క‌లెక్ట‌రేట్‌లో డిప్యూటీ త‌హ‌శీల్దార్.  క‌రోనా పాజిటివ్ రావ‌డం..శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది కావ‌డంతో బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఓ కార్పొరేట‌ర్ ఆస్ప‌త్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. రోజూ రూ.5 ల‌క్ష‌లు చొప్పున మూడురోజుల‌కు హాస్ప‌ట‌ల్  రూ.15 ల‌క్ష‌ల బిల్లు వేసింది. అయినా ఆయ‌న ప్రాణాలు ద‌క్క‌లేదు. ఇప్పుడు మొత్తం డ‌బ్బు క‌ట్టేదాకా డెడ్ బాడీనీ అప్ప‌గించే ప్ర‌సక్తే లేద‌ని హాస్ప‌ట‌ల్ సిబ్బంది తేల్చి చెప్ప‌డంతో కుటుంబ‌స‌భ్యులు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు. 

నారాయ‌ణ పేట జిల్లా క‌లెక్ట‌రేట్ లో డిప్యూటీ  త‌హ‌శీల్దార్‌గా విధులు నిర్వ‌హించే శ్రీ‌నివాస్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఓ ప‌నిమీద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత క‌రోనా లక్ష‌ణాలు క‌ని‌పించ‌డంతో టెస్టులు చేయించుకున్నారు. వారం క్రితం పాజిటివ్ అని తెలిసి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంటి ఓన‌రుకు విష‌యం తెలిసి, వెళ్లిపొమ్మ‌ని చెప్ప‌డంతో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని కొడుకు  ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టం కావ‌డంతో హైద‌రా బాద్‌కు వెళ్లారు. కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో ఎవ‌రూ చేర్చుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు క‌లెక్ట‌ర్ అనుమ‌తితో కాచిగూడ‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో జాయిన్ చేశారు. ఈ క్ర‌మంలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ శుక్ర‌వారం సాయంత్రం మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. బుధ‌,గురు, శుక్ర‌వారాల్లో హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ ఏకంగా రూ.15 ల‌క్ష‌లు బిల్‌వేయ‌గా, తాము రూ.5 ల‌క్ష‌లు క‌ట్టిన‌ట్టు చెబుతున్నారు. మిగ‌తా డ‌బ్బులు క‌డితేనే డెడ్‌బాడీని  అప్ప‌గిస్తామ‌ని చెప్ప‌డంతో తాము హాస్పిట‌ల్ బ‌య‌టే ఎదురుచూస్తున్నామ‌ని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. 
July 25, 2020

క‌రోనా బాబా అంట‌....వీపు వాయించిన‌ పోలీసులు..! I

హైద‌రాబాద్‌: ఒక ప్ర‌క్క ప్ర‌పంచ మంతా క‌రోనా భారి నుండి త‌ప్పించ‌కునేందుకు ముఖానికి మాస్కులు, శానిటైజ‌ర్లు, భౌతిక‌దూరం పాటించాల‌ని రోజూ ప్ర‌భుత్వాలు గ‌గ్గోలు పెడుతుంటే మ‌రో ప్ర‌క్క నిమ్మ‌కాయ‌ల‌కు, మంత్రాల‌కు క‌రోనాను త‌గ్గిస్తాన‌ని పుట్టొచ్చాడో క‌రోనా బాబా..! ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఆ బాబా దుమ్ము దులిపేశారు. 
హైద‌రాబాద్‌లోని హ‌ఫీజ్ పేట్ హ‌నీఫ్ కాల‌నీలో క‌రోనా బాబా ఒక‌రు ద‌ర్శ‌న‌మెత్తారు. మాయ‌లు, మంత్రాల‌తో క‌రోనాను న‌యం చేస్తానంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్న క‌రోనాబాబా అలియాస్ ఇస్మాయిల్ బాబా స్థావ‌రంపై పోలీసులు  దాడులు నిర్వ‌హించారు. ఒక్కో క‌రోనా రోగి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కూ వ‌సూళ్లు చేస్తున్నాడు. మంత్రాలు, నిమ్మ‌కాయ‌లు, విభూతితో పూజ‌లు చేసి అమాయ‌కుల‌ను న‌మ్మించి మోసం చేస్తున్నాడు. గ‌త మార్చి నుంచి క‌రోన బాబా దందాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా బాబాకు అతీత‌మైన శ‌క్తులు ఉన్నాయంటూ శిష్యుల‌చే ప్రచారం చేసుకున్నాడు. మాస్క్ పెట్టుకోన‌క్క‌ర్లేదు. అపూర్వ శ‌క్తుల‌తో క‌రోనా బారి నుండి కాప‌డ‌తానంటూ న‌మ్మ‌బ‌లికిన క‌రోనాబాబా జ‌లుబు, ద‌గ్గు ఉన్నా.. అది క‌రోనా నే అంటూ అమాయ‌కులైన జ‌నాల్ని భ‌య‌పెట్టి వేలాది రూపాయ‌లు వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డాడు. ఈ బాబా చేతిలో సుమారు 70 మంది బాధితులు మోస‌పోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. క‌రోనా సోకిన‌ట్టైతే ఆసుప‌త్రి కి వెళ్లాల‌ని అక్క‌డున్న జ‌నాన్ని పోలీసులు పంపించారు. మోసాల‌కు పాల్ప‌డే ఇలాంటి బురిడీ క‌రోనా బాబాల‌ను న‌మ్మొద్దంటున్నారు పోలీసులు. 

క్వారంటైన్‌లో దారుణం..రేప్ చేసి..వీడియోతీసి..!

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో దారుణం చోటుచేసుకుంది. క్వారంటైన్‌లో ఉన్న 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్ద‌రు కామాంధులు రేప్ చేసి వీడియో తీసి బ్లాక్ మెయిలకు పాల్ప‌డిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఢిల్లీలో ఛ‌తూర్‌పూర్‌లో ని స‌ర్థార్‌ప‌టేల్  కోవిడ్ 19 కేర్ సెంట‌ర్‌ణు  టిబెటియ‌న్ బార్డ‌ర్ పోలీసులు నిర్వ‌హిస్తున్నారు. జులై మొద‌టి వారంలో 14 ఏళ్ల బాలిక‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్య‌లు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఛ‌తూర్ పూర్‌లోని క్వారంటైన్ కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నారు.  అదే క్వారంటైన్‌లో 19 ఏళ్ల బాలుడు, మ‌రో 19 ఏళ్ల అత‌ని స్నేహితుడు అక్క‌డ చికిత్స పొందుతున్నారు. బాలిక మీద ఇద్ద‌రు స్నేహితులు గ‌త వారం రోజుల నుంచి క‌న్నేశారు.  ఈ నెల 15వ తేదీ అర్ధ‌రాత్రి బాలిక మూత్ర విస‌ర్జ‌న చెయ్య‌డానికి క్వారంటైన్ కేంద్రంలోని బాత్‌రూంలోకి వెళ్లింది. అదే స‌మ‌యం కోసం వేచిచూస్తున్న ఇద్ద‌రు కామాంధులు బాలిక వెళ్లిన బాత్‌రూం్‌లోకి చొర‌బ‌డ్డారు. 19 ఏళ్ల కామాంధుడు బాలిక‌పై అత్యాచారం చేశాడు.
అదే స‌మ‌యంలో మ‌రో 19 ఏళ్ల యువ‌కుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా దృశ్యాల‌ను మొబైల్‌లో వీడియో తీశాడు. త‌ర్వాత అత్యాచారం వీడియో అడ్డం పెట్టుకున్న ఇద్ద‌రు కామాంధులు త‌మ కోరిక తీర్చాల‌ని బాలిక‌ను బ్లాక్ మెయిల్ చెయ్య‌డం మొద‌లుపెట్టారు. బాలిక జ‌రిగిన విష‌యం ఆమె కుటుంబ స‌భ్య‌ల‌కు చెప్పింది. బాలిక ఫిర్యాదు మేర‌కు ఇండో టిబెటియ‌న్ బార్డ‌ర్ పోలీసులు ఇద్ద‌రు కామాంధుల‌ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ అడిష‌న‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ర్వీంద‌ర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజ‌రుప‌రిచామ‌ని అన్నారు. అత్యాచారం చేసే స‌మ‌యంలో వీడియో తీసిన మొబైల్ ఫోన్‌ను తాము స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. బాలిక‌ను సంర‌క్ష‌ణా కేంద్రానికి త‌ర‌లించామ‌ని, ఆమె క‌రోనా వైర‌స్ వ్యాధి నయం అయ్యే వ‌ర‌కు అక్క‌డే ఉంటుంద‌ని పేర్కొన్నారు. బాలిక‌పై అత్యాచారం జ‌రిగిన కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో 10,000 వేల ప‌డ‌క‌లు ఉన్నాయి. ఇక్క‌డ ఢిల్లీతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లోని క‌రోనా పాజిటివ్ రోగుల‌కు చికిత్స అందిస్తున్నారు. 

Tuesday, July 21, 2020

July 21, 2020

కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం: నాగం

హైద‌రాబాద్: కృష్ణాన‌దీ జ‌లాల‌ను ఏపీకి త‌ర‌లించే విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మధ్య చీక‌టి ఒప్ప‌దం ఉన్న‌ద‌ని పీపీసీ కృష్ణాన‌దీ జ‌లాల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ నాగం జ‌నార్థ‌న్ రెడ్డి అన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లిగించి, ఇక్క‌డి రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టే హ‌క్కు కేసీఆర్‌కు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన త‌ర్వాతే ఏపీ ప్ర‌భుత్వం పోతిరెడ్డిపాడు కేపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచింద‌ని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను ర‌ద్దు చేసేలా తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున సుప్రీం కోర్టు లో పిటిష‌న్ వేసి కేసీఆర్ చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాల‌ని డిమాండ్ చేశారు.
ఏపీ చేస్తున్న నీటి దోపిడీ ఇప్ప‌టికైనా ఆపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో జాతీయ‌, అంత‌ర్జాతీయ నీటి చ‌ట్టాల‌ను ఉల్లంఘించి కృష్ణా న‌ది జలాల‌ను పెన్నా న‌ది బేసిన్‌లోని తెలుగు గంగ‌, సోమ‌శిల‌, కండ‌లేరు, గాలేరు-న‌గ‌రి, వెలిగొండ వంటి ప్రాజెక్టుల‌కు త‌ర‌లించేలా చేయ‌డం త‌ప్పు కాదా? అని ప్ర‌శ్నించారు. 326 టీఎంసీల కెపాసిటీతో అక్ర‌మంగా రిజ‌ర్వాయిర్లుక‌ట్టి నీటిని దోచుకుంటున్న‌ది వాస్త‌వాం కాదా? ఈ ప్రాజెక్టుల్లో అక్ర‌మాలు చాల‌వ‌న్న‌ట్టు ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ కృష్ణా న‌ది నీటిని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే కేసీఆర్ ప్రేక్ష‌క పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. దీనిపై ఎందుకు నోరుమెద‌ప‌డం లేద‌న్నారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాబేసిన్‌లో ల‌క్ష‌ల ఎక‌రాల భూమికి సాగునీరు అంద‌డం లేద‌న్న‌ది వాస్త‌వాం కాదా? అని ప్ర‌శ్నించారు. 
ఒక బేసిన్‌లో సాగునీరు, తాగునీరు పూర్తి స్థాయిలో స‌రిపోయిన త‌ర్వాతే మ‌రో బేసిన్‌లోకి తీసుకుపోయే అవ‌కాశం ఉటుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ మీ క‌ళ్ల‌ముందే మ‌న నీటిని అక్ర‌మంగా ఆ రాష్ట్రంలోని పెన్నార్ బేసిన్‌కు త‌ర‌లించుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇందులో రాజ‌కీయ కుట్ర ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుంద‌ని ఆరోపించారు.  ఏపీ సీఎం జ‌గ‌న్ చేసే ఈ నీటి దోపిడీ వెనుక మీ మ‌ధ్య ఉన్న చీక‌టి ఒప్ప‌దం ఏమిటి?  నేను పంపిన లెట‌ర్‌ను పూర్తిగా చ‌దివి నా ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వాల‌ని నాగం జ‌నార్థ‌న్ రెడ్డి  కోరారు. 

Saturday, July 18, 2020

July 18, 2020

ముందు నుండి వెన‌క్కి వెళ్లిన ఎంపీ సీటు..!

న్యూఢిల్లీ (NewDelhi):
న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు స్పీక‌ర్ షాక్ ఇచ్చారు. లోక్‌స‌భ‌లో ర‌ఘురామ‌కృష్ణంరాజు స్థానాన్ని స్పీక‌ర్ మార్చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ముందు సీటు నుంచి వెనుక‌కు ర‌ఘురామ‌కృష్ణం రాజు స్థానం వెళ్లిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ఘురామ‌కృష్ణంరాజు సీటు నెంబ‌ర 379లో కూర్చునే వారు. ఇక‌పై ఆయ‌న సీటు నెంబ‌ర్ 445 లో కూర్చోనున్నారు. ర‌ఘురామ‌కృష్ణంరాజు సీటును వైసీపీ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్‌కు కేటాయించారు స్పీక‌ర్‌. మార్గాని భ‌ర‌త్‌, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌, బెల్ల‌న చంద్ర‌శేఖ‌ర్ సీట్లు ముందుకెళ్ల‌గా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీటు మాత్రం నెంబ‌ర 379 నుంచి సీటు నెంబ‌ర్ 445కు వెళ్లింది. అన‌ర్హ‌త పిటిష‌న్ స‌మ‌ర్పించే స‌మ‌యంలోనే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీటు మార్చాల్సిందిగా స్పీక‌ర్‌ను వైసీపీ కోరింది. పార్టీ ఫిర్యాదు మేర‌కే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీటును స్పీక‌ర్ మార్చిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

జీతాలివ్వండి మ‌హా ప్ర‌భో...వాలంటీర్ల గోడు..!

విజ‌య‌వాడ రూర‌ల్‌: గ‌త ఐదు మాసాలుగా త‌మ‌కు రావాల్సిన వేత‌నాలు వెంట‌నే మంజూరు చేయాల్సిందిగా కోరుతూ కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ప‌రిధిలోని వాలంటీర్లు రెండురోజులుగా విధుల‌ను బ‌హిష్క‌రించారు. గ‌త ఐదు  నెల‌లుగా వేత‌నాలు అద‌క‌పోవడంతో తీవ్ర  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో రెండ్రోజులుగా స‌చివాల‌యాల‌కు హాజ‌రుకాకుండా విధులు బ‌హిష్క‌రిస్తూ త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొండ‌పల్లి మున్సిపాలిటీ కొత్త‌గా ఆవిర్భ‌వించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని, త‌మ జీతాలు చెల్లించాలంటూ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ను మైల‌వ‌రం ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ అనేక‌మార్లు విన్న‌వించినా ఫ‌లితం లేక‌పో యింద‌ని వాలంటీర్లు చెబుతున్నారు. చేసేది ఏమీ లేక తామంతా విధులు బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వాలంటీర్లు తెలిపారు. త‌మ వేత‌నానికి సంబంధించిన ఫైల్ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారుల వ‌ద్ద ఉంద‌ని మైల‌వ‌రం ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ చొర‌వ‌తీసుకుని వెంట‌నే వేత‌నాలు అందే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. త‌మ డిమాండ్లు ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కూ విధుల‌కు హాజ‌ర‌య్యేది లేద‌ని వాలంటీర్లు స్ప‌ష్టం చేస్తున్నారు. 

ఇది చ‌ద‌వండి : క‌రోనా :అంత్య‌క్రియ‌ల‌కు ఓ ప్యాకేజీ అంట‌..!

Friday, July 17, 2020

July 17, 2020

ముంబై : గోడ కూలి ఏడుగురి మృతి..!

ముంబై(Mumbai): ముంబై న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. అస‌లే క‌రోనా కేసులు పెరుగుతున్న వేళ‌, వ‌ర్షాలు తీవ్రంగా ప‌డ‌టంతో న‌గ‌ర వాసులు భ‌యాందోళ‌న చెందుతున్నారు.  రోడ్ల‌పైకి వ‌ర‌ద నీరు భారీగా ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా గురువారం కురిస‌న భారీ వ‌ర్షాల‌కు ఇళ్లు కూలిన ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల ప్రాంతంలో ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలోని భానుషాలీ భ‌వ‌నం కొంత భాగం కూలిపోవ‌డంతో ఐదుగురు మృతిచెందారు. మ‌రో 23 మందిని  ప్ర‌భుత్వ సిబ్బంది ర‌క్షించారు.
         విష‌యం తెలుసుకున్న ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే సంఘ‌టనా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. 14 అగ్నిమాప‌క శ‌క‌టాల‌ను సంఘ‌ట‌నా స్థ‌లానికి చేర్చి పోలీసులు మ‌రియు ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి. ఈ సంద‌ర్భంగా ముంబై స‌బ‌ర్భ‌న్ జిల్లా సంర‌క్ష‌క మంత్రి ఆదిత్య థాక‌రే మ‌లాద్ ప్రాంతంలో ఇల్లు కూలిపోయి మ‌ర‌ణించిన కుటుంబ‌స‌భ్యుల‌కు ఒక్కొక్క‌రికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. అంతుకు ముందు రోజు బుధ‌వారం న‌గ‌రంలోని ప‌వ్వాలా వీధిలో ఓ ఇంట్లో కొంత భాగం కూలిపోవ‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. అనంత‌రం వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

వ‌సుంధ‌రా రాజే కాంగ్రెస్‌కు స‌హాయం చేస్తోంది: ఎంపీ

రాజ‌స్థాన్ : బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజే కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు సాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని  రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన ఎంపీ హ‌నుమాన్ బెనివాల్ ట్విట‌ర్ ద్వారా ఆరోపించారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాజ‌కీయాల్లో గంద‌ర‌గోళం ప‌రిస్థితి నెల‌కొని ఉంది. మాజీ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజేను కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఆశ్ర‌యించార‌ని, ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరార‌ని అదే విధంగా స‌చిన్ ఫైల‌ట్‌కు దూరంగా ఉండా ల‌ని కోరిన‌ట్టు త‌న ద‌గ్గ‌ర రుజువు ఉంద‌ని ఆ ఎంపీ తెలిపారు. వ‌సుంధ‌రా రాజే కుటుంబ‌స‌భ్యులు మ‌రియు స‌న్నిహిత స‌హాయ‌ కులు గెహ్లాట్‌కు స‌హాయం చేస్తున్నార‌ని అన్నారు. అందువ‌ల్ల అశోక్ యొక్క స‌ర్కారు కూలిపోయే ప‌రిస్థితి లేద‌ని తెలిపారు. రాజ‌‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రెబ‌ల్  స‌చిన్ ఫైల‌ట్ నుంచి భారీ ముప్పును ఎదుర్కొంటుంద‌ని ఆరోపించారు.  ఎంపీ హ‌నుమాన్ బెనివాల్ 2018 ఎన్నిక‌ల‌కు ముందు బిజేపీని విడిచిపెట్టారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ చీఫ్  స‌తీష్ పునియా మాట్లాడుతూ బెనివాల్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌వ‌ద్ద‌ని తెలిపారు. 

క‌రోనాతో అర్జున అవార్డు గ్ర‌హిత మృతి..!

బెంగుళూరు(Bengaluru): అర్జున అవార్డు గ్ర‌హీత‌, ఏస్ పారా బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ర‌మేష్ తికారం గురువారం ఓ ఆస్ప‌త్రిలో క‌రోనా వైర‌స్‌తో మృతిచెందారు. పారా బ్యాడ్మింట‌న్ ఇండియా అధ్య‌క్షుడు ఎన్‌సీ సుధీర్  మాట్లాడుతూ..'ఈ రోజు మ‌ధ్యాహ్నం ర‌మేష్ తికారం మ‌ర‌ణించార‌ని మీకు తెలియ‌జేసేందుకు విచారిస్తున్నాం. 'అని సుధీర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  పీటిఐ  మాట్లాడుతూ.. జ్వ‌రం, ద‌గ్గుతో ఉన్న 51 ఏళ్ల  ర‌మేష్ తికారంను గ‌త నెల 29న ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్టు తెలిపారు. ఈ క్రీడాకారుడికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 2001లో అంత‌ర్జాతీయ పారా బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌ను దేశానికి తీసుకురావ‌డంలో తికారం కీల‌క పాత్ర పోషించార‌ని త‌న స్నేహితుల్లో ఒక‌రైన కే.వై వెంక‌టేష్ తెలిపారు.