chittor : చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మండలం టేకుమంద అటవీ ప్రాంతం, బండ్లదొద్ది గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు బీభత్సం చేసింది. బండ దొడ్డి గ్రామానికి చెందిన చంద్ర చారి అనే రైతుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
గురువారం ఉదయం ఆవులను అడవిలోకి మేత కోసం లోపలికి వదిలాడు. సాయంత్రం ఆవులు ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో చంద్ర ఆచారి మరియు కుప్పయ్య ఇద్దరూ అడవి లోపలికి వెళ్లారు.
ఆవులను వెతికే సమయంలో ఒంటరి ఏనుగు తారస పడింది. ఆ ఏనుగు మేత కోసం పొలాలు వైపు రావడంతో అది గమనించిన కుప్పయ్య పారిపోయాడు. చంద్ర ఆచారి పై ఏనుగు దాడి చెయ్యడంతో అతనికి పక్కటెములకు గాయాలు అయ్యాయి. దీంతో ఊపిరాడక పోవడంతో తిరుపతి రమాదేవి ఆసుపత్రికి తరలించారు.