Top Ten Encounter Specialists in India| Best Super Police |గబ్బర్ సింగ్ పోలీసులంటే వణుకు పుట్టాల్సిందే! Khammameekosam: దేశంలో పోలీసుల వ్యవస్థ లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు ఇష్టారాజ్యంగా పెరిగిపోయి ఉండేవి. నిత్యం ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఇలాంటివి చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసులు ముఖ్యపాత్ర పోషించడంతో సమాజంలో ప్రతి వ్యక్తి కాస్త ప్రశాంతంగా జీవిస్తున్నాడనేది నిజమెరిగిన సత్యం.
పోలీసుల వృత్తిలో తమ విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన విషాదకరమైన సంఘటనలూ ఉన్నాయి. అదే విధంగా రౌడీలకు, మాఫీయా డాన్లకు, రాజకీయ నాయకులకు ముచ్చెమ్మటలు పట్టించి, ఒంటిలో వణుకు పుట్టించిన హీరోలు లాంటి పోలీసులూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పటికీ, కరుడు గట్టిన నేరగాళ్ల పాలిట మాత్రం పోలీసు బాస్ లే గన్ పట్టుకొని తుదిముట్టించిన ఘటనలు దేశంలో ఎన్నో ఉన్నాయి.
ఇప్పటికీ రౌడీలకు, మాఫియా డాన్లకు రాజకీయంతో సంబంధాలు ఉండ టం, వారిని కాపాడుతూ రాజకీయనాయకులు పోలీసులను చూసీచూడనట్టు వదిలి వేయండని పై నుంచి ఫోన్లు రావడంతో నికార్సైన పోలీసు నిబంధనలు పాటించని పరిస్థితి నెలకొంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలీసు వృత్తిలో మడమతిప్పని ఖాకీలు నిత్యం రౌడీలతో, మాఫియా డాన్లతో యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు.
దేశంలో కొంతమంది ఐపిఎస్ అధికారులు నేరగాళ్ల పాలిట సింహ్నస్వప్నంలా కనిపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తుపాకులతో హల్ చల్ చేస్తూ పోలీసులకు ఎదురితిరిగిన రౌడీలను ఏరిపారేసిన స్పెషల్ ఎన్కౌంటర్లు దేశంలో పదులు సంఖ్యలో ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లకు సారథ్యం వహించిన ఐపిఎస్ అధికారులు ప్రజల గుండెల్లో గబ్బర్ సింగ్ లా నిలిచిపోయారు. అలాంటి మోస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిష్టుల గురించి తెలుసుకుందాం!.
1. VC SAJJANAR IPS
2.DAYA NAYAK IPS
3.PRADEEP SHARMA DCP
4.PRAFUL BHOSELE INSPECTOR
5.DEPAK KUMAR IPS
6.RAJBIR SINGH ACP
7.VIJAY SALASKAR INSPECTOR
8.AMITABH YASH IPS
9.RAJESH KUMAR IPS
10.ANAND DEV IPS
1. VC SAJJANAR IPS
1996 ఐపిఎస్ బ్యాచ్‌కి చెందిన విసి సజ్జనార్ వరంగల్ యాసిడ్ దాడి కేసులో మొదటి సారిగా పాపులర్ అయ్యారు. ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన నిందితులను గంటల వ్యవధిలోనే ఎన్కౌంటర్ చేశారు. తర్వాత 2019 నవంబర్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన విషయంలో ఐపిఎస్ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. అమాయకురాలి ప్రాణాలు తీశారని, నిందితులను ఎన్కౌంటర్ చేయడమే మంచిదని ప్రజలు సజ్జనార్‌కు జేజేలు పలికారు.
2.DAYA NAYAK IPS
దర్శకుడు రాంగోపాల్ వర్మ డిపార్టమెంట్ నుంచి నానాపటేకర్ తీసిన అబ్ తక్ చప్పన్ మూవీ లాంటి ఎన్నో సినిమాలు దయా నాయక్ ఐపిఎస్ మీద వచ్చాయి. ఒక్కప్పుడు సినిమా తారలు, రాజకీయ నాయకులు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పేరు చెబితే గజగజా వణికేవారు. దావూద్ దుబాయ్‌లో కూర్చొని ఇక్కడ బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసేవాడు. కానీ దయానాయక్ ఐపిఎస్ రంగంలోకి దిగిన తర్వాత ముంబైలో మాఫియా రౌడీలను కుక్కలు మాదిరిగా ఏరిపారేశారు.
దాదాపుగా 85 ఎన్కౌంటర్లు చేశారు. దయానాయక్ ఐపిఎస్ పరిధిలోకి కేసు వెళ్లిదంటే నేరగాళ్లకు ఉచ్చబడినట్టే. కోర్టులు, శిక్షలు తర్వాత అసలు ప్రాణాలతో ఉంటామా అనే భయంతో నేరగాళ్లు వణికిపోతుంటారు. అయితే దయానాయక్పై అవినీతి ఆరోపణలు రావడంతో అరెస్టు కూడా అయ్యారు. సుప్రీం కోర్టు అతనిపై ఎన్ని కేసులు ఉన్నా కొట్టి వేయడంతో క్లీన్ చీట్‌తో మళ్లీ బయటకు వచ్చారు.
3.PRADEEP SHARMA DCP
1990 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో ముంబైలో గ్యాంగ్ వార్లు విపరీతంగా ఉండేవి. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట గొడవలు మొదలవ్వడంతో పోలీసులకు తల నొప్పిగా మారింది.ఇదే సందర్భంలో ప్రజల నుంచి విమర్శలు వచ్చేవి. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వచ్చేవి. ఆ దశాబ్ధ కాలంలో ముంబైలోని మాఫియా డాన్లు పోలీసులను భయపెట్టి దౌర్జన్యంగా తమ వారిని పోలీసుస్టేషన్ల నుంచి తీసుకెళ్లేవారు. ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం మనుషులు నానా అంగామా చేసేవారట. సినిమా నటులు కూడా ఎవ్వరీ చెప్పుకోలేక మాఫియాలకు డబ్బులు పంపించేవారట. అదే సమయంలో హీరోలా వచ్చి ఆదుకున్నారు ప్రదీప్ శర్మ. బెదిరించి వసూళ్లు చేసే కింది స్థాయి రౌడీలందర్నీ చుట్టుముట్టారు. దాదాపు 84 మంది ఎన్కౌంటర్ చేశారు. లెక్కలోనికి రానివి చాలా ఉన్నాయని తోటి పోలీసు అధికారులు చెబుతుంటారు. ఆ రోజుల్లో ముంబైలోని ధనవంతులు, రాజకీయ ప్రముఖులు, సినిమా తారలు ఊపిరి పీల్చుకున్నారంటే కారణం ప్రదీప్ శర్మ అంట.
4.PRAFUL BHOSELE INSPECTOR
ఈ పోలీసు అధికారి ఏకంగా చోటా షకీల్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తన మాట వినకపోతే ఎక్కడున్నా రౌడీలను పట్టుకుంటానని ముంబైలోని వరుస ఎన్ కౌంటర్లు చేశారు. దాదాపుగా 84 మందిని ఎన్కౌంటర్ చేశారు. నిప్పును నిప్పుతోనే కాల్చాలనే విధంగా క్రిమినల్స్‌ను క్రిమినల్స్ ద్వారే సమాచారం తీసుకొని ఒక్కొక్కరిని ఏరిపారేశారు ప్రపుల్ బోస్లే.
5.DEPAK KUMAR IPS
ఉత్తర ప్రదేశ్‌లో క్రిమినల్స్ పోలీసులనే బెదిరిస్తుంటారు. ఎందుకంటే వారికి రాజకీయ నాయకుల అండ ఉంటుంది. దీంతో నీతి, నిజాయతీ ఉన్న అధికారులు కూడా మాకెందుకులే అనుకుంటారు. కానీ దీపక్ కుమార్ మాత్రం ప్రత్యేకంగా నిలిచారు. ఒక కేసులో పెద్ద రౌడీని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో వేశారట. అదే సాయంత్రం దీపక్ కుమార్ ఇంటికి కొందరు లోకల్ రౌడీలు వచ్చి తమ వ్యక్తిని విడుదల చేయాలని అన్నా రు. తెల్లారేసరికి తమ వ్యక్తిని వదిలివేయకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని చంపుతామని బెది రించారు. దీంతో షాక్ కు గురైన దీపక్ చౌదరి ఐపిఎస్ నే బెదిరిస్తారా? అంటూ తాను అరెస్టు చేసిన పెద్ద రౌడీని రాత్రికి రాత్రే ఎన్కౌంటర్ చేశారు. ఈ వార్త తెల్లవారుజామున పేపర్ లో చూసి బెదిరించిన లోకల్ రౌడీలు బ్రతుకు జీవుడా! అంటూ పారిపోయారట. అలా ప్రజల్లోకి మంచి పేరు తెచ్చుకున్న దీపక్ కుమార్ దాదాపు 56 మందిని ఎన్కౌంటర్ చేశారట.
6.RAJBIR SINGH ACP
ఢిల్లీలోని ల్యాండ్ మాఫియాకు ఏసీపీ రజ్బీర్ సింగ్ అంటే హడల్. ఆయన ప్రభావం ఎంతలా ఉందంటే రాజకీయ నాయకులు ల్యాండ్ సెటిల్మెంట్ జోలికి పోకుండా కేవలం రాజకీయాలు చేసుకోవడం మొదలు పెట్టారట. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, స్థానిక పోలీసులను కొందరు బెదిరిస్తున్నారని తెలిస్తే రజ్బీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగేవారట. నాలుగేళ్లలోనే ల్యాండ్ మాఫియా నేరగాళ్లు భూముల జోలికి రాలేదట. కానీ దురదృష్టవ శాత్తు ఓ దుండగుడి చేతిలో బలయ్యారు. కానీ ఢిల్లీ ప్రజల మనసుల్లో మాత్రం ఉండిపోయారు.
7.VIJAY SALASKAR INSPECTOR
దేశం ఎప్పటికీ గుర్తుంచుకొని వ్యక్తి విజయ్ సలాస్కర్. ఈ అధికారి ధైర్యానికి మారుపేరుగా చెప్పవచ్చు. ప్రజల కోసం అవలీలగా ప్రాణాలు పణంగా పెట్టే వ్యక్తి ఎవరంటే విజయ్ సలాస్కర్ను గుర్తు తెచ్చుకుంటారు. ముంబై దాడుల సమయంలో ముందుండి టెర్రరిస్టులపై పోరాడారు. విజయ్ సలాస్కర్కు సాహసాలు కొత్తమే కాదు. ముంబైలోని సుమారు 60 మందిని ఎన్కౌంటర్ చేశారు. ముంబైలో ఒక్కప్పుడు సామాన్యులు సైతం వ్యాపారం చేసుకోవాలంటే భయపడేవారు. అరుణ్ గ్యావ్లీ గ్యాంగ్ జనాలను బెదిరించి డబ్బలు వసూలు చేసేవారట. కానీ విజయ్ ఈ గ్యాంగ్ మొత్తాన్ని అంతం చేశారు. కొందరు ముంబై నగరాన్ని వదిలి తమ సొంత గ్రామాలకు పారిపోయిన సంఘటనలూ ఉన్నాయట.
8.AMITABH YASH IPS
ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయ నాయకులను వణికించేందుకు ఐపిఎస్ లలో అమితాబ్ యష్‌ను ఉపయోగించేవారట. ఎందుకంటే నేరస్థులు ఎక్కడ ఎక్కువుగా ఇబ్బందులు పెడుతున్నారో అక్కడకు ఈ అధికారిని పంపేవారట. ఆయన వస్తున్నారంటే చాలు. రాజకీయ నాయకులు కూడా బయట తిరగరట. నేరస్థులు జైలుకు వెళ్లడమో, జిల్లా వదిలి పారిపోవడమో చేసేవారట. దాదాపు కరుడుగట్టిన 36 మంది నేరగాళ్లను ఎన్కౌంటర్ చేశారు.
9.RAJESH KUMAR IPS
నాలుగు సార్లు అవార్డు పొందిన దమ్మున్న పోలీసు అధికారి రాజేష్ కుమార్ పాండే ఐపిఎస్.ఈ అధికారి నేరస్థుల పాలిట సింహ స్వప్నం. గ్యాంగ్ స్టర్ శ్రీప్రకాష్ పట్ల రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అండతో నేరాలు చేయడంతో పాటు తప్పించుకొని తిరిగేవాడు. అయితే రాజేష్ కుమార్ పాండే పక్కా ప్లాన్‌తో అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఆ గ్యాంగ్ స్టర్ తో లింకు ఉన్న అందర్నీ రోడ్డున పడేశారు. వారంతా ఎలాంటి వారో ప్రజలకు చూపించారు.అదే విధంగా దాదాపు 50 ఎన్కౌంటర్ల చేసి తన ధైర్యసాహసాలు నిర్వర్తించారు.
10.ANAND DEV IPS
ఉత్తర్ ప్రదేశ్‌లో చంబల్ లోయ అంటేనే నేరగాళ్లకు అడ్డా అనేది అందరికీ తెలుసు. ఒక్కప్పుడు పూలందేవీతితో సహా దొంగలు, దారిదోపీడీ చేసేవారు ఇలా పగలంతా లోయలో ఉండి రాత్రిపూట ఊళ్లమీద విరుచుకుపడేవారు. ఆ రోజుల్లో పెద్దవాళ్లు తప్ప, మిగతా వారు వారిని చూసి భయపడేవారు. 2006లో ఐపిఎస్ ఆనంద్ దేవ్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. అడవిలో జంతువులు తప్ప మరెవ్వరూ ఉంటే ఒప్పుకోనని వార్నింగ్ ఇచ్చారు. ఇలా చంబల్ లోయలో ఉన్న దాదాపు 60 మందిని ఎన్కౌంటర్ చేశారు. తుపాకీ పట్టుకున్న ప్రతిఒక్కర్నీ కాల్చేయడమో లోపల వేయడమో చేశారు. ఆనంద్ దేవ్ వచ్చిన తర్వాత చంబల్ లోయలో పరిస్థితి అంతా మారింది. సామాన్య జనం, రాజకీయ నాయకులు ధైర్యంగా తిరగగలిగారు.
ఇలా పోలీసు వృత్తిలో నీతిగల అధికారులను వారి పని వారిని చేయనిస్తే నేరాలు అనే మాట వినబడదు. కానీ స్వార్థ రాజకీయాలతో కొందరు నాయకులు ఇప్పటికీ రౌడీలకు, మాఫియాకు కొమ్ము కాస్తూనే ఉన్నారు. పోలీసులను ఒక బంట్రోతు లాగానే చూస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట నిజమైన పోలీసు తన పని తాను చేసుకూంటు నిజాయితీగా ఉంటూ ప్రజల మన్నలను పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పిన వారే కాకుండా ఎంతో మంది దేశంలో నిజాయితీగల పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. వీరందర్నీ కృష్టికి, త్యాగానికి ప్రతి ఒక్కరం సెల్యూట్ చేద్ధాం. వారిని గౌరవిద్ధాం!.