సీసీఎంబీ డైరెక్టర్ చెబుతున్న వాస్తవం ఏమిటి?
The Second Wave Has Begun In India | భారత్‌లో మరో లాక్డౌన్ తప్పదా?న్యూఢిల్లీ : కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. మానవ తప్పిదాల వల్ల కరోనా చాలా చోట్ల విజృంభిస్తుందన్న ఆయన ప్రస్తుతం భార్త్లో ఢిల్లీలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు. ఈ సెకండ్ వేవ్ అంటే భయపడటానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే కరోనా పట్ల అప్రమత్తండా ఉండటం ఈ పరిస్థితుల్లో మంచిదని అన్నారు. సెకండ్ వేవ్ వస్తే చాలా కస్టమని ఢిల్లీలో ప్రస్తుతం ప్రారంభమైందని తెలిపారు.
అలానే ఈ వైరస్ మన చుట్టూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు. కొన్ని సార్లు ఈ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, పండగలు, పెళ్లిళ్లులో జాగ్రత్తలు పాటించకపోతే మరలా లాక్ డౌన్ తప్పనిసరి అవుతుందని హెచ్చరించారు. 60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హెల్త్ ఇమ్యూనిటీ లేదా వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ వేవ్‌లు వస్తూనే ఉంటాయని రాకేశ్ పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే ఈ ఏడాది నుంచి మరో రెండేళ్లు పడుతుందని అందుకే మాస్క్ శానిటేషన్ వల్లే కరోనా వైరస్‌ను జయించాలని ఆయన పేర్కొన్నారు.
ఇండియా విమానాలపై చైనా ఆంక్షలు!
భారత్ విమానాలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.’ కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్ నుంచి వచ్చే విదేశీయుల్ని చైనాలోకి అనుమతించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయించాం.
కాబట్టి భారత్ లోని రాయబార కార్యాలయం అధికారులు చైనా వీసా, నివాస అనుమతులు కలిగిన వారికి ఆరోగ్యనిర్థారణ దరఖాస్తులను ఇవ్వరు. ఈ నిబంధనలు చైనా దౌత్య, గౌరవ, సీ వీసాలు కలిగి ఉన్న వారిపై ప్రభావం చూపించవు. ఒక వేళ ఎవరైనా అత్యవసర సందర్శనకు వచ్చే వారు రాయబార కార్యాలయంలో వీసా దరఖాస్తు సమర్పించుకోవచ్చు. కరోనా నేపథ్యంలో ఈ నిబంధనలు తాత్కాలికంగానే వర్తిస్తాయి.’ అని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
గత వార్తం ఢిల్లీ నుంచి వ్యూహాన్ కు ఎయిర్ ఎండియా విమానంలో వెళ్లిన వారిలో 20 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా భారత విమానాలను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్రాగన్ దేశం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నవంబర్ 13 నుంచి డిసెంబర్ 4 వరకు చైనాకు ఎయిర్ ఇండియా ఇప్పటికే షెడ్యూల్ చేసిన నాలుగు( వందేభారత్) విమానాలపై ప్రభావం పడనుంది. బెల్జియం, బ్రిటన్, ఫిలిఫైన్స్ నుంచి వచ్చే చైనాయేతర సందర్శకులకు సైతం ఇదే తరహా ప్రకటన జారీ చేసింది.