That father is a real bharateeyudu| kurnool in real bharateeyudu ఆన్లైన్ యాప్: కొడుకులను పోలీసులకు పట్టించిన తండ్రి!Kurnool: ఈ రోజుల్లో ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా తమ పిల్లలపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో పోలీసు మెట్లు ఎక్కకుండా ఆగమే ఘాలపై ఏదో ఒక నాయకుడి కాళ్లపై పడి పిల్లలను కాపాడుకుంటున్న తల్లిదండ్రులు కోట్లల్లో ఉన్నారు. వాస్తవంగా కొడుకు ఎంత నేరస్తుడైనా తల్లిదండ్రులకు కొడుకేగా, ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది. కానీ ఎప్పుడో 20 ఏళ్ల కిందట వచ్చిన భారతీయుడు సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసే ఉంటది. అదే విధంగా ఆ సినిమాలో తండ్రి కమల్‌హాసన్ అన్యాయాన్ని ఏమాత్రమూ సహించడు. తన కొడుకు డబ్బు తీసుకొని అవినీతికి పాల్పడి చేసిన తప్పుకు పదుల సంఖ్యలో పిల్లలు చనిపోతారు. ఈ విషయం స్వయంగా చూసిన తండ్రి కమల్‌హాసన్ చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనే విధంగా కొడుకును చంపేంత వరకూ వెంటాడుతాడు. నిజంగా ఈ సినిమా చూస్తున్నంత సేపు అలానే ఉండాలనిపించేలా ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం కనిపించింది.
ఇక అసలు విషయానికి వద్దాం..! ఇటీవల ఆన్లైన్ యాప్ మోసాలకు పదుల సంఖ్యలో యువత, గృహిణులు ఆత్మహత్య చేసుకున్నఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రెండు రాష్ట్రాలు సీరియస్‌గా తీసుకున్న ఈ ఆన్లైన్ మోసాలపై సైబర్ టీం ఆపరేషన్ ప్రారంభించింది. ఆన్లైన్ యాప్‌లను వాడొద్దని విజ్ఞప్తి చేసింది. ఎవరైనా ఒత్తిళ్లకు గురిచేస్తే పోలీసులను సంప్రదించాలని కోరింది. చెప్పిన 24 గంటల్లోనే సైబర్ టీంకు కొన్ని లక్షల ఫిర్యాదులు ఫోన్ల ద్వారా వచ్చాయి.
దీంతో షాక్‌కు గురైన పోలీసులు ఆన్లైన్ యాప్‌లు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాయో అర్థమైంది. ఇటీవల చైనాకు చెందిన ఓ వ్యక్తిని అతనికి భారతదేశంలో సహకరిస్తున్న వ్యక్తిని అరెస్టు కూడా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎఎస్సైకి నాగరాజు, ఈశ్వర్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ బెంగుళూరులో ఆన్లైన్ల్ మనీ యాప్ సెంటర్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా తన కుమారుడు నాగరాజు లక్షలాది మందిని మోసం చేయడం తన తండ్రికి తెలిసింది.
నిజాయితీ పరుడైన ఆ తండ్రి ఏఎస్సై తన పిల్లలు చేసే పనిని సహించలేకపోయాడు. మూడ్రోజుల కిందట తన కుమారులను ఇంటికి రమ్మని ఫోన్ ద్వారా చెప్పాడు. అయితే తమ్ముడు నాగరాజు ఇంటికి వచ్చిన రెండురోజుల తర్వాత సైబరాబాద్ పోలీసులకు ఫోన్ చేశాడు. తన కుమారుడిని అరెస్టు చేయమని చెప్పాడు.పోలీసులు ఆ కుమారుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. అన్న ఈశ్వర్ కూడా పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. కన్న తండ్రి తన కుమారులను అరెస్టు చేయడంపై ఒక పోలీసుగా తన నిజాయితీని చాటుకున్నందుకు ప్రస్తుతం ఆ తండ్రికి సెల్యూట్ చేస్తున్నారు. నిజమైన భారతీయుడు అని ప్రశంసలతో అభినందిస్తున్నారు. ఇలాంటి నిజాయితీ గల తండ్రికి, ఏఎస్సైకి మనం కూడా సెల్యూట్ చేద్దాం..సెల్యూట్!.
ఇది చదవండి: గబ్బర్ సింగ్ పోలీసులంటే వణుకు పుట్టాల్సిందే!