Tamil Nadu police arrested MLC B-Tech Ravi|ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుKadapa: టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆదివారం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ రవి 2018లో కడప జిల్లా పులివెందుల పూల మార్కెట్ వద్ద జరిగిన రాళ్ల దాడిలో ప్రధాన ముద్దాయిగా ఉన్న టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో తమిళనాడు పోలీసులు అరెస్టు చేయడానికి యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
రాళ్ల దాడి హత్యాయత్నం కేసులో వారెంట్ పెండింగ్ ఉన్నప్పటికీ రవి కనీసం అరెస్టు కాకపోవడంతో పాటు కనీసం బెయిల్ కూడా తీసుకోలేదు. దీంతో ఈ రోజు తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
2018లో అభివృద్ధి పనులపై రచ్చకైనా, చర్చకైనా సిద్ధమని చెప్పిన టిడిపి నేతలు రాళ్లు, కర్రలతో దాడి చేసినట్టు అప్పట్లో కేసు నమోదైంది. 2018 ఫిబ్రవరి 28న కడప ఎంపి అవినాష్ రెడ్డి కి, టిడిపి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డికి మధ్య సవాళ్ల పర్వం నడించింది. చర్చలకు తాను సిద్ధమని కడప ఎంపి అవినాష్ రెడ్డి చెప్పడంతో పాటు ఎక్కడికైనా వచ్చి చర్చలకు సిద్ధమని 2018 మార్చి 1న ప్రతిసవాల్ విసిరారు.
పులివెందులలోని పూలమార్కెట్లో సాయంత్రం 4 గంటలకు చర్చలకు రావాలని సతీష్ రెడ్డి సవాల్ విసిరారు. అనంతరం చర్చ గొడవలకు దారి తీసింది. ఈ కేసులో దాదాపు 200 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు 63 మందిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే బెయిల్ తీసుకోకుండా తిరుగుతున్న బీటెక్ రవిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
ఇది చదవండి : తెలంగాణలో కాంగ్రెస్కు షాక్ తగలనుందా?