Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
Share link

 

Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టుNellore : కోట్లు విలువ చేసే పూడుపాముల‌ను ఓ స్మ‌గ్లింగ్ ముఠా రాష్ట్రాలు దాటిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వారు ప‌ట్టుబ‌డ‌టం లేదు. అయితే ఆంధ్రా, త‌మిళ‌నాడు పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చేశారు. పూడుపాముల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న స్మ‌గ్లింగ్ ముఠాను ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి లో అట‌వీ శాఖ జిల్లా అధికారి షణ్ముఖ‌కుమార్ విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేసి పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు పోలీసు అధికారులు సంయుక్తంగా స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న పూడుపాముల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు.

Smuggling gang arrested

సౌత్ ఇండియా రీజ‌న్ సెంట్ర‌ల్ వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో మ‌రియు ఏపీ ఫారెస్ట్ డిపార్మెంట్ జాయింట్ ఆప‌రేష‌న్ చేశారు. నాయుడు పేట జాతీయ ర‌హ‌దారిపై అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న కోట్లు విలువ చేసే పూడు పాముల‌తో పాటు అంత‌ర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను ప‌ట్ట‌కునున్న‌ట్టు తెలిపారు. నిందితుడు ద‌గ్గ‌ర నుండి ఒక పూడుపాము, 8 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్‌టాపులు , 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పూడుపాముల‌ను మందుల త‌యారీలోకి వాడ‌తార‌ని అనేవి వ‌ట్టి మూఢ‌న‌మ్మ‌కాలు అని మూగ‌జీవులు, వ‌ణ్య‌ప్రాణుల‌ను త‌ర‌లించ‌డం నేర‌మ‌ని వారు తెలిపారు. ఈ స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో ఏపీకి చెందిన 7 గురు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్టు వివ‌రాలు వెల్ల‌డించారు.

ఇది చ‌ద‌వండి : ఏనుగు దాడిలో రైతుకు తీవ్ర‌గాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *