Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

By | December 30, 2020
Share link

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌ Visakhapatnam : విశాఖ‌ప‌ట్ట‌ణంలో దారుణం చోటుచేసుకుంది. తాటిచెట్ల‌పాలెం సంతోషి మాత ఆల‌యం స‌మీపంలో సుభాన్ అనే రౌడీ షీట‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. వెంక‌టేశ్వ‌ర‌న‌గ‌ర్ కాల‌నీలో నివాస‌ముంటున్న సుభాన్ ను ఇంట్లోనే క‌త్తుల‌తో న‌రికి హ‌త్య చేశారు. హ‌త్య అనంత‌రం ఇంటి త‌లుపుకు తాళం వేసి పారిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల వారు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు.పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లిని ప‌రిశీలించి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కొంత‌కాలంగా సుభాన్ ఓ మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Rowdy Sheeter Murdered in Visakhapatnam

ఆమే అత‌డ్ని హ‌త్య చేపించిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలో క్లూజ్ టీమ్‌, డాగ్ స్వ్కాడ్ తో త‌నిఖీలు చేస్తున్నారు. సుభాన్ మృత‌దేహాన్ని పోస్టు మార్టం కోసం కేజీహెచ్ కు త‌ర‌లించారు. ప్ర‌శాంతంగా ఉండే విశాఖ ప‌ట్ట‌ణంలో హ‌త్య జ‌ర‌గ‌డంతో స్థానికులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. సుభాన్ కు గ‌తంలో నేర చ‌రిత్ర ఉండ‌టంతో పోలీసులు అత‌డిపై రౌడీ షీట్‌ను ఓపెన్ చేశారు. సుభాన్ స్థానికంగా ఉండే సెటిల్మెంట్లు చేస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొంత కాలంగా ఓ మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు త‌లెత్త‌డంతో ఆమె హ‌త్య చేయించింద‌ని అనుమానిస్తున్నారు. పోలీసులు మ‌హిళ కోసం గాలిస్తున్నారు. సుభాన్ స్నేహితులను విచారిస్తున్నారు. అత‌ని ఫోన్ కాల్ డేటాను కూడా సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రో వైపు సుభాన్ రౌడీ షీట‌ర్ కావ‌డంతో ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా ప‌క్కా స్కెచ్ తో హ‌త్య చేసి ఉంటారా? అనే కోణంలో కూడా విచార‌ణ జ‌రుగుతోంది. విశాఖ‌లో నేర చ‌రిత్ర ఉన్న‌వారు, రౌడీ షీట్ లిస్టులో ఉన్న వారిని కూడా పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల సుభాన్ తో గొడ‌వ ప‌డిన వ్య‌క్తులు, అత‌ని జోక్యం చేసుకున్న వివాదాల‌పైనా ఆరా తీస్తున్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల క్రైమ్ రేట్ పెరుగుతుండ‌టంతో స్థానికులు ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. 20 రోజుల క్రితం వేర్వేరు చోట్ల ముగ్గురు అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఆ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. అనంత‌రం రౌడీ షీట‌ర్ హ‌త్య పోలీసుల‌కు స‌వాల్ గా మారింది.

ఇది చ‌ద‌వండి: న‌గ‌రంలో న్యూయ‌ర్ వేడుక‌లు నిషేధం : సీపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *