MP Revanth Reddy is angry over anti-farmer laws | నల్లచట్టాలకు వ్యతిరేఖంగా తెలంగాణ రైతు గళం వినిపిద్ధాం : రేవంత్ రెడ్డిHyderabad: రైతుల ఉద్యమానికి మద్దతుగా ఇంటికొక్కరు బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని మల్కాజగిరి ఎంపి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకలు వి.హనుమంతురావు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభా నేత సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని, అత్యవసర శాసన సభ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ అత్యవసర శాసన సభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలను తిరస్కరిస్తూ, రైతులకు మద్దతుగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నార న్నారు. దీక్ష చేపట్టిన పార్టీ సీనియర్ నాయకులకు తాను ఒక చిన్న విన్నపం చేస్తున్నా అన్నారు. ఢిల్లీలో చేపడుతున్నరైతులు దీక్షకు ఎవరి మద్దతు లేదని బీజేపీ ఆరోపిస్తుందన్నారు. ఏదో పంజాబ్ , హర్యానా, రాజస్థాన్ లో మాత్రమే రైతులు ఉద్యమి స్తున్నారని, మిగతా రాష్ట్రాల్లో అందరూ బాగున్నారని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మంత్రి తోమర్ ఆరోపించారన్నారు.
తెలంగాణ నుంచి రైలులో ఢిల్లీకి…!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించాలంటే, రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలపాలంటే తెలంగాణ రైతులందరం కలిసి రైలులో ఢిల్లీకి వెళదామని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వీధుల్లో కదం తొక్కుదామని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌కు చెందిన కాంగ్రెస్ నాయకత్వం రైలు రాకపోకల ఖర్చులు భరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాబట్టి తేదీ ఖరారు చేయండని, తెలంగాణ రైతుల సమాజం మొత్తం ఢిల్లీ వీధుల్లో ధీక్ష చేస్తున్న రైతులుకు అండగా ఉండి సంఘీభావం తెలుపుదామని అన్నారు. ఢిల్లీలో దీక్షలు చేపడుతున్న రైతులకు తెలంగాణ రైతు సమాజం అండగా ఉన్నదనేది చాటి చెప్పాలంటే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కాబట్టి దీక్షల్లో ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, రైతులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయం పై ఆధార పడి జీవిస్తున్న తెలంగాణ సమాజం కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు ప్రమాదకరమైనవి అని అన్నారు. ఆ చట్టాలు అమలు అయితే రానున్న తరాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా మనమంతా ఏకం కావాలని, రాజకీయాలకు అతతీంగా నల్లచట్టాలను వ్యతిరేకించాలని రేవంత్ రెడ్డి కోరారు.