Hyderabad: చాలా కాలం తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల ఆధ్వర్యంలో వస్తున్న Love Story Teaser ఆదివారం విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తున్నారు. లవ్‌స్టోరీ సినిమాపై దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడారు.
ఈ సినిమా టీసర్ విడుదలైందని, మంచి రెస్పాన్స్ వస్తుందని పేర్కొన్నారు. యూత్‌కు దగ్గరగా కనెక్ట్ అయ్యేందుకు పాత్రల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల కాస్త ఆలస్యం అయ్యిందన్నారు.
లవ్ స్టోరీ కథలో హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తాడు. ఆ సమయంలో తాను పడిన కష్టాలను, తన ప్రేమ విషయంలో పడిన ఇబ్బందులను సినిమాలో చూపిస్తున్నామన్నారు. Love Story సినిమాలో ఎక్కువుగా మధ్య తరగతి యువత జీవితంలో ఎదుర్కొనే కష్టాల కనుగుణంగా ఉంటుందని, ప్రతి ఒక్కరికీ ఇది నా కథే అనే విధంగా కొనసాగుతుందని శేఖర్ కమ్ముల అన్నారు. ఈ సినిమాలో హీరో నాగచైతన్యను కొత్త లుక్‌లో చూస్తారన్నారు. లవ్ స్టోరీ సినిమా కోసం నాగచైతన్య బాగా కష్టపడ్డారని పేర్కొన్నారు.
సినిమాను థియోటర్లలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే థియోటర్లు మళ్లీ తెరుచుకోవడం, పలు సినిమాలు థియోటర్లలో విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. అతి త్వరలో Love Story సినిమాను థియోటర్లలో విడుదల చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. Love Story సినిమా టీసర్‌ను చూసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
నాగచైతన్య చివరిగా 2019 సంవత్సరంలో మజిలీ సినిమా లో హీరోగా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీని కూడా బాగా ఆకట్టుంది. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పాటు హీరో నాగచైతన్య, తన భార్య సమంత జోడీతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం 2021లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా కూడా మజిలీ సినిమా లాగా ఉంటుందని టీసర్ చూసిన వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ ఆధ్వర్యంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా కు కథ, దర్శకత్వం శేఖర్ కమ్ముల కాగా, నిర్మాతలుగా నారాయన్ దాస్ కె.నారంగ్ మరియు పుసుకూర్ రామ్ మోహన్ రావు ఉన్నారు. సంగీతాన్ని సిహెచ్. పవన్ అందించారు. ఈ పాటలు Wynk Music, Amazon Music, Apple Music, Spotify, JioSaavn లో అందుబాటులో ఉన్నాయి.