IDHWA Demand | UP CM Yogi Adityanath should resign | యూపీ మంత్రి రాజీనామా చేయాలి: ఐద్వాkhammam: ఉత్తర్ ప్రదేశ్లోని హాత్రాస్ ఘటనను మరువక ముందే మరో 50 సంవత్సరాల మహిళ గుడికి వెళితే పూజారి అతని అనుచరులు ఇద్దరు అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి చంపండం దారుణమని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ గురువారం ఖమ్మంలో ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక సరిత క్లీనిక్ సెంటర్లో యూపీ సీఎం యోగీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
బండి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి మాట్లాడుతూ 50 సంవత్సరాల మహిళను కాళ్లు చేతులు, పక్కటెముకలు విరిచి అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపారని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకీ మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని విమర్శించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అత్యాచారలను, హత్యలన నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. యోగి పాలనలో గుడికి వెళ్లే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా నియంత్రించలేని సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, పిన్నింటి రమ్య, భాగం అజిత, ప్రమీల, భూలక్ష్మీ, పద్మ, పుష్పమ్మ, లీల తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: కెమెరాలో రికార్డైన వైరల్ వీడియోలు