డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్
విడుదలైన షెడ్యుల్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల ఆయా పార్టీలు హోరాహోరీగా గెలుపుకోసం పోరాడగా నియోజకవర్గ ప్రజలు బిజేపీకి పట్టం కట్టారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలపై అందరి చూపు పడటంతో ఈ ఎన్నికల్లఓ కీలక ఘట్టమైన పోలింగ్ డిసెంబర్ 6వ తేదీన జరిగే అవకాశం ఉంది. ఆ రోజు ఆదివారం కావడంతో సెలవు దినం పోలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం కూడా ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. డిసెంబర్ 6న పోలింగ్ అనుకుంటే దానికి, నామినేషన్ల దాఖలు మొదలయ్యే తేదీకి మధ్య 15 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండాలి. ఈ లెక్కన ఈ నెల 22న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు కానుంది. దీంతో అంతకంటే ముందు ఎప్పుడైనా షెడ్యుల్‌ను విడుదల చేయవచ్చు. అయితే దీపావళి తర్వాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని పార్టీల నేతలు ఇంతకు ముందే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
మంగళవారం(ఈనెల 17న) గానీ, ఈ నెల 20 గానీ షెడ్యూల్‌ను ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, నగరంలో వరద ముంపు బాధితులకు సహాయం అందించడం కోసం మీ సేవ కేంద్రాల ద్వాఆరా దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో వీటి కోసం మరో రెండు, మూడు రోఉలు గడువు నిచ్చిన అనంతరం షెడ్యూల్‌ను ప్రకటించవచ్చిన తెలుస్తోంది.
రె’ఢీ’గా ఉన్న పార్టీలు
గ్రేటర్ ఎన్నికల పోరుకు అధికార, విపక్షాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్దమయ్యాయి. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే కారణంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు వరాలను ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలను డివిజన్ల బాట పట్టించింది. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలను వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలిచితీరాలనే లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పార్టీ నేతలను తరలించే ప్రక్రియకూ శ్రీకారం చుట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డటానికి సిద్ధపడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కని పరాభవం నుంచి బయటపడటానికి గ్రేటర్ ఎన్నికల్లో గౌవరప్రదమైన విజయాలు నమోదు చేసుకోవాలనే తలంపుతో వ్యూహరచన చేస్తోంది.
ఇక దుబ్బాకలో సంచలన విజయంతో ఊపుమీదున్న బీజేపీ, గ్రేటర్ పీఠంపైనా కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు తగినట్టుగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా స్వయంగా ఈ సారి గ్రేటర్ ఎన్నికలకు పర్యవేక్షించబోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ యుద్ధాన్ని తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా, అభ్యర్థులు ఖరారు కాకపోయినా గ్రేటర్ ఎన్నికల ముందస్తు ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యేలు, సిట్టింగ్ కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పాదయాత్రలతో మహానగరంలోని కొన్ని డివిజన్లు ¬రెత్తుతున్నాయి.