హైదరాబాద్ : గమనం(Gamanam) సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ లో విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలిసి ట్రైలర్ ను వీక్షించారు. ఇక మూడు విభిన్న కథలతో తెరకెక్కిన గమనం ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షి స్తోం దని చిత్ర బృందం పేర్కొంది.
గమనం(Gamanam) ట్రైలర్ పరిశీలిస్తే..!
గమనం(Gamanam) వీని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిందీలో సోనూసూద్, తెలుగులో పవన్ కళ్యాణ్ తో పాటు పలు ఆయా భాషల్లో హీరోలు సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో ప్రధాన పాత్రల్లో హిరోయిన్ శ్రియ శరన్(Shriya Saran), నిత్యామీనాన్(Nithya Menen) తో పాటు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఐదు భాషల్లో ఒక్కసారే విడుదల కావడంతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వరదలు, వానలు నేపథ్యంలో కూడా ఈ కథ నడిచినట్టు తెలుస్తోంది. తొలుత శ్రియ(Shriya Saran) పుట్టిన రోజు గమనం ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు.
![]() |
Gamanam Poster |
కాగా మూడు కథల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందనేది తెలుస్తోంది. ట్రైలర్ లో మురికి వాడల్లో జీవనం సాగించే గృహిణి పాత్రలో శ్రియ శరన్(Shriya Saran) కనిపించింది. చెవిటి పాత్రలో నటిస్తున్న శ్రియ శరన్(Shriya Saran) కు ఇద్దరు పిల్లలు ఉంటారు. భర్త వదిలి వేయడంతో ఆ ఇద్దరి పిల్లలతో అవస్థలు పడుతూ జీవినం సాగించే కథ ఆమెది. క్రికెటర్ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఓ ముస్లీం యువతి కథ, రోడ్డు మీద చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం కథ లతో సినిమా ట్రైలర్ అబ్బుర పరుస్తుంది. నిత్యామీనన్(Nithya Menen) పాత్ర విషయానికి వస్తే కర్ణాటకకు చెందిన ప్రముఖ గాయకురాలు సైలపూర్తి దేవి పాత్రలో కనిపించింది. ప్రముఖ రచియిత సాయిమాధవ్ మాటలు సమకూర్చుతున్నారు. కొన్ని కొన్ని డైలాగులు జీవితంలో సామాన్యుని మనస్సును తాకేలా, ఆలోచింప జేసేలా ఉన్నాయి.
మొత్తంగా పేద, మధ్య తరగతి కుటుంబాల జీవిత సారాశ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గమనం(Gamanam) సినిమాకు డైరెక్టర్‌గా సృజనా రావు, దర్శకత్వం రమేష్ కరుటూరి, సంగీతం ఇలియరాజా అందించగా వెంకి పుష్పడపు, గన్నా శేఖర్ తదితరులు పనిచేశారు. ఈ సినిమా నవంబర్ 18న విడుదల కానుంది.
గమనం(Gamanam) మూవీ నటీనటులు:
శ్రియశరన్, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక, చారు హుస్సేన్, సుహాన్, సంజయ్ స్వరూప్, బిత్తిరి సత్తి, ఇందు ఆనంద్, రవి ప్రకాష్.
![]() |
Gamanam Telugu Trailer |