Fake chilli seeds in Jaggayyapeta Mandal | నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు
Fake chilli seeds in Jaggayyapeta Mandal
Jaggayyapeta : ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తున్న రైతన్నలకు ఆదిలోనే కష్టాల పర్వం మొదలవుతుంది. ‘మా కంపెనీ విత్తనాలు మంచివి‘ అంటూ రైతన్నల వద్దకు వెళ్లి డెమోలు చూపించి వారిని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి. గతేడాది పంట నష్టపడిపోయాం.. కనీసం ఈ సారైనా మంచి పంట పండిద్దామని ఆశగా ఆ కంపెనీల విత్తనాలు తీసుకుంటున్న రైతన్నలకు నకిలీ విత్తనాలు అంట కట్టడంతో ‘మోసపోయాం మహాప్రభో’ అంటూ రోడ్డెక్కే పరిస్థితిలు వచ్చాయి.
తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం లో ఈ నకిలీ విత్తనాల మోసం వెలుగులోకి వచ్చింది. మండలంలోని రెడ్యానాయక్ తండా రైతులు నకిలీ మిరప నారు కొని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అడిగిన రకం మిరప నారు ఇవ్వకుండా దిగుబడి బాగా వస్తుందని మాయమాటలు చెప్పి మరో రకం విత్తనాలు ఇచ్చారని స్థానిక బాధిత రైతులు చెబుతున్నారు. 30 ఎకరాలలో 15 మంది రైతులు మిరప పంటను సాగు చేసినట్టు వారు తెలుపుతున్నారు.
ఒక మిరప మొక్క రూ.2 చొప్పున కనీసం ఎకరానికి 15000 వేల మొక్కలు నాటిన్నట్టు రైతులు పేర్కొంటున్నారు. పంట దిగుబడి రాక పోవడంతో నర్సరీ యజమానికి తెలిజేస్తే వచ్చి పంటను పరిశీలిస్తున్నారు తప్ప, తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఒప్పందం చేసుకున్నప్పుడు ఇచ్చిన బిల్లులు ఇప్పుడు చూపిస్తున్న బిల్లులు పలు రకాలుగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా నష్టపోయిన తమను ఆదుకోని, న్యాయం చేయాలని బుధవారం జగ్గయ్యపేట తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ చెప్పారు.
ఇది చదవండి : ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య
ఇది చదవండి : అత్యంత దారుణంగా యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది
ఇది చదవండి :అమెరికా 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం