Darsi: Linemen caught taking bribes | లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లైన్మెన్Darsi : లంచం తీసుకుంటూ ఓ లైన్మెన్ అవినీతి నిరోధక శాఖా అధికారులకు పట్టబడిన సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రాంజపల్లి గ్రామానికి చెందిన 9 మంది రైతులు తమ పొలాల వద్ద రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కొద్ది కాలంగా లైన్ మెన్ లక్ష్మీనాయక్ను వేడుకుంటున్నారు. విద్యుత్ స్థభాలు ఏర్పాటు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని పేర్కొన్నాడు. ఆ రైతుల వద్ద నుండి రూ.1.01 లక్షలు డిమాండ్ చేశాడు. గత డిసెంబర్ (2020) నెలలో 10,11 తేదీల్లో రెండు దఫాలుగా రైతుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు.
మిగిలిన రూ.51 వేలు ఇస్తేనే విద్యుత్ స్థంభాలు వేస్తానని చెప్పడంతో రైతులు అవినీతి నిరోధక శాఖాధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మిగిలిన రూ.51 వేలను సంబంధిత రైతు సుబ్బారావు ఇంటి వద్ద తీసుకుంటుండగా, ముందస్తు సమాచారంతో సిద్ధంగా ఉన్న అవినీతి నిరోధక శాఖాధికారులు లైన్ మెన్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో డిఎస్పీ ఎం.సూర్యనారాయణ రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చదవండి: శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ టీసర్ విడుదల