Commitment Movie Teluguతెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నటి, హీరోయిన్ తేజస్వి సంచలనమైన విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్లో తెలుగుమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు అనే విషయంపై కొన్ని ఆసక్తికర విష యాలు తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదని, ఇక్కడ పడుకోవడానికి కూడా సిద్ధపడే ఉండాలని చెప్పుకొచ్చింది.
ఐస్‌క్రీమ్ లాంటి సినిమాలతో తేజస్వి టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 90 శాతం ఇక్కడ పడుకోనిదే పనులు జరగవని చాలా ఓపెన్‌గా చెప్పు కొచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో పడుకోమని అడిగే వాళ్లు చాలా మంది ఉన్నారంటూ సంచలన నిజాలు చెప్పింది తేజస్వి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత తనకు చాలా చాన్సులు వచ్చాయని, కానీ ప్రతిచోట మేం ఆఫర్ ఇస్తాం. నువ్వేమిస్తావు? అంటూ అడిగేవారిని గుర్తు చేసుకుంది. మరికొందరుఅయితే డైరెక్టుగా సెక్స్ టాపిక్ తీసుకొచ్చేవారని చెప్పింది. కామ వాంఛ తీర్చకపోతే అవకాశం రాదని చెప్పేవారని, వాటిని ఒప్పుకోలేకతాను చాలా సినిమాలను వదిలేసానని చెప్పింది తేజస్వి.
పడుకుంటేనే సినిమాలలో అవకాశం : తేజస్వి
ఇక్కడ అందం, అదృష్టంతో పాటు అవకాశం కోసం పడుకోవాలని నగ్నసత్యాలు తెలిపింది. తాజాగా ఈమె కమిట్మెంట్ సినిమాలో నటించింది. ఈ సినిమా కథ తన జీవితానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకొచ్చింది. లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. అందులో కూడా అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే పడుకోవాలని నేరుగా అడిగేస్తుంటారు. అయితే ఆ విషయాన్ని నేరుగా చూపించాడు దర్శకుడు లక్ష్మీకాంత్. సెక్స్ తోనే లైఫ్ మొదలవుతున్నప్పుడు లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటి? అనే ప్రశ్న కూడా ఇందులో ఉంది. ఈ రోజుల్లో పడుకోకపోతే అవకాశాలు రావని అర్హమైపోయిందని చెప్పంది. తనలా ప్రతిభ ఉండి కూడా రేసులో వెనుకబడటానికి కారణం పడుకోడానికి ఒప్పుకోకపోవడమే అంటుంది తేజస్వి.
ముంబై నుంచి వచ్చే వాళ్లు అయితే దేనికైనా ఒప్పుకుంటారనే ఒకే ఒక్క కారణంతో వాళ్లను తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు అంటుంది. అంటే తన ఉద్ధేశ్యం బాలీవుడ్ నుంచి వచ్చే వాళ్లంతా అలాగే ఉంటారని కాదు. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందనేది అర్థం చేసుకోవాలని చెప్పింది తేజస్వి. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు, తమిళ అమ్మాయిలకు కూడా తెలుసంటుంది.
లవ్‌స్టోరీ బ్రేకప్
ఈ కాస్టింగ్ కౌచ్‌తో తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయానని చెప్పింది. తన లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయిందని, అప్పట్లో తనకు ఓ అబ్బాయితో అఫైర్ ఉండేదని, అతడితో పెళ్లి కూడా సిద్ధమయ్యానని, కానీ సినిమా నుంచి వచ్చాననే ఒకే ఒక్క కారణంతో అతడు తనపై అనుమానపడి దూరంగా పెట్టాడని చెప్పింది. దాంతో పాటు రామ్‌గోపాల్ వర్మ సినిమాలో నటించావు. నువ్వు అలాంటి పనలు చేయలేదంటే ఎలా నమ్మమంటావని తనపై అనుమానంతో దూరం చేసుకున్నాడని ఆవేదనతో చెప్పింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవడం కంటే దూరంగా అలా మౌనంగా ఉండటమే మంచిదని చెప్పంది. అంతేకాదు తనకు ఆ మధ్య బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని, అయితే అందులో నగ్నంగా నటించాలని చెప్పడంతో వదిలేశానని చెప్పుకొచ్చింది. ఇప్పుడుల లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కించిన కమిట్మెంట్ కథ అంతా తన మాదిరే ఉందని చెప్పుకొచ్చింది తేజస్వి.