Chittoor Accident News: కాలువ‌లో ప‌డ్డ ద్విచ‌క్ర వాహ‌నం క‌ర్నాట‌క వాసి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
Share link

Chittoor Accident News: కాలువ‌లో ప‌డ్డ ద్విచ‌క్ర వాహ‌నం క‌ర్నాట‌క వాసి మృతిChittoor : చిత్తూరు జిల్లాలోని వి.కోట మండ‌లం ప‌ట్ర‌ప‌ల్లి స‌మీపంలో కెజిఎఫ్ రోడ్డులో ఉన్న హంద్రీనీవా కాలువ‌లో అర్థ‌రాత్రి ద్విచ‌క్ర వాహ‌నం ప‌డింది. ఈ ప్ర‌మాదంలో క‌ర్ణాట‌క‌కు చెందిన వ్య‌క్తి మృతి చెందాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం రోడ్డుపై వెళుతున్న వారు గ‌మ‌నించి పోలీసుల‌కు తెలియ‌జేశారు. వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి సీఐ ఎల్ల‌మ‌రాజు, ఎస్సై మ‌హేష్ చేరుకున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును ప‌రిశీలించారు. పోలీసుల విచార‌ణ‌లో మృతుడు క‌ర్ణాట‌క రాష్ట్రం వెంక‌టాపురంకు చెందిన శ్రీ‌నివాసులుగా గుర్తించారు. అర్థ‌రాత్రి మ‌ద్యం సేవించి న‌ర్స‌రీ ప‌నుల కోసం వి.కోట‌కు వెళ్లే స‌మ‌యంలో కాలువ‌లో ప‌డి మృతి చెందిన‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Chittoor Accident News


లారీని ఢీకొన్న కారు | భార్యాభ‌ర్త‌ల‌కు గాయాలు

Tirupathi : తిరుప‌తి నుండి నెల్లూరుకి వేగంగా వెళుతున్న కారు వీరంప‌ల్లి క్రాస్ రోడ్డు వ‌ద్ద మంగ‌ళ‌వారం లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో భార్య భ‌ర్త‌ల‌తో పాటు పిల్ల‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. పాద‌లకూరు నుండి హైవే కి చెన్నై వెళ్లేందుకు క‌ట్టెల లారీ రోడ్డు దాటుతోంది. ఇది గ‌మ‌నించ‌ని కారు లారీ ని ఢీకొట్ట‌డంతో కారు టాపు లేచి నుజ్జునుజ్జ‌య్యింది. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Chittoor Accident News

ఇది చ‌ద‌వండి: కోడి పందాల బ‌రులు ధ్వంసం చేసిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *