Bird Flu Alert in Telugu states | Symptoms of bird fluతెలుగు రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ భయం! | చికెన్ ధరలపై ప్రభావం!Hyderabad: కొద్ది రోజులుగా ఉత్తర భారతదేశంలో కోరలు చాచిన బర్డ్‌ఫ్లూ ప్రమాద ఘంటికలు తెలుగు రాష్ట్రాలను భయపెట్టిస్తున్నాయి. ఇప్పటికే హెచ్5ఎన్8 వైరస్ తో హర్యానాలో పది రోజుల్లో 4 లక్షలు కోళ్లు మృతి చెందాయి. అప్రమత్తమైన కేరళ, కాశ్మీర్, హిమాచల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేలాది కోళ్లను, బాతులను చంపేస్తున్నారు. పక్షులకు ప్రాణాంతకమైన ఈ బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తోందని వైద్యులు తెలుపు తున్నారు. దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోన్న బర్డ్‌ఫ్లూ వైరస్ తో కశ్మీర్ నుంచి కేరళ వరకు వేల సంఖ్యలో వలస పక్షులు మృత్యువాత పడుతున్నాయి.
ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసంది. ఈ బర్డ్‌ఫ్లూ వైరస్‌ను తొలుత హిమాచల్ ప్రదేశ్‌లోని పోంగ్ డ్యామ్ సరస్సు వద్ద వలస పక్షుల్లో గుర్తించారు. భారీ సంఖ్యలో పక్షులు అక్కడికక్కడే మృత్యువాత పడటంతో అధికారులు పరీక్షలు నిర్వహిచగా బర్డఫ్లూ సోకినట్టు తేలింది. అదే సమ యంలో అటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాకులు మరణించడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో గత నెల 29న దలై కాలేజీ ప్రాంగణంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌తో దాదాపు 50 కాకులు మృతి చెందాయి. మొత్తంగా 155 కాకులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు.
ఇక కేరళ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూతో 1,700 బాతులు మరణించడంతో అలప్పుజ, కొట్టాయం ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు, బాతులన్నింటినీ చంపేస్తున్నారు. ముఖ్యంగా వైరస్ వెలుగు చూసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నెడుముకి, తకఝై, పల్లిప్పాడ్, కరువట్ట గ్రామాల్లో పక్షులన్నింటినీ చంపుతున్నారు. దాదాపు 40 వేల పెంపుడు కోళ్లు, బాతులను చంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
15 రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్!
దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వైరస్ వేగంగా పాకుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్ పరిధిలో 15 రోజుల వరకు చికెన్, కోడిగుడ్ల అమ్మకంపై నిషేధం విధించింది. కేరళలో ఈ ప్రభావాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. నిపా వైరస్ కూడా కేరళలో భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. కేరళలో వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉండేందుకు అనుకూలంగా ఉండ టంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళకు వెళ్లే రవాణాలపై కూడా ఈ ప్రభావం చూపుతోంది.
బర్డ్‌ఫ్లూ వైరస్ ఎక్కువుగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో కనిపిస్తోంది. పక్షుల్లోనే కనిపించే ఈ వైరస్ మనుషులకూ వ్యాపిస్తోందని మొదటిసారి 1997 లో గుర్తించారు. వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా ఉంటే మనుషులకు కూడా వస్తోందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 60 శాతం మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వైరస్ నిర్మూలనకు టీకాలు కూడా మార్కెట్లో ఉననాయి. మనుషులకు అరుదుగా సోకే ఈ బర్డ్‌ఫ్లూ వైరస్ ఉత్పతరివర్తనం చెందే లక్షణం అధికంగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం
పక్కరాష్ట్రాల్లో వేగంగా విజృంభిస్తోన్న బర్డ్‌ఫ్లూ వైరస్ విషయంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలకు ఎన్క్లోజర్లు, మోట్లలో సున్నం చల్లి, నీటిని చల్లుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రభావం చికెన్, గుడ్లు ధరలపై ప్రభావం చూపనుంది. ధరలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
కేరళలో పల్లిప్పాడ్ వద్ద బాతులను కాల్చడానికి పట్టుకుంటున్న జిల్లా యంత్రాంగం వీడియో!
ఇది చదవండి: ఇక పల్లెల్లో ఆధార్ కేంద్రాలు!