AP GOVT: Aadhar Card Correction Centers in Village|ఇక పల్లెల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలు vijayawada: దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. పుట్టిన పిల్లల నుంచి చనిపోయేంత వరకూ ఒకే ఆధార్ కార్డుతో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, బ్యాంకు లావాదేవీలు తదితర పనులన్నీ జరుగుతున్నాయి. అయితే ఆధార్ కార్డు ఇప్పటికీ లేని వ్యక్తులు దేశంలో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ కార్డు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సులువుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది. ప్రజలు కొన్ని సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయని, అడ్రస్ సరిగ్గా లేదని అధికారులు దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టేస్తున్నారు. దీంతో పథకాలు తీసు కొనేందుకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ఆధార్ కార్డు లో ఏ చిన్న తప్పు దొర్లినా అధికారులు ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలని నిలిపివేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి గ్రామాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సన్నహాలు చేస్తున్నారు. 1-5 సంవత్సరాలు కలిగిన పిల్లలకు, వేలి ముద్రలు అరిగిపోయిన వృద్ధులతో పాటు కొత్త గా జారీ చేసే కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇప్పటికే పట్టణాల్లో ఆధార్ కార్డుల నమోదు సెంటర్లు ఉంటడం వల్ల పల్లెల నుంచి అక్కడకు వెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియను చేపించుకుంటున్నారు. అయితే గ్రామాల్లోఈ సౌలభ్యం ఏర్పాటు చేస్తే కార్డుల సవరణ పెండింగ్‌లు పరిష్కారమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోవడం వల్ల వారికి రావాల్సిన పెన్షన్ ఆగిపోతుంది. కొంత మందికి రేషన్ కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కేంద్రాల్లో సచివాలయ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్, ఉమెన్ ప్రొటక్షన్ విభాగం వారు ప్రజలకు సేవలందించనున్నారు.
ఇది చదవండి : ‘కేటిఆర్ ముఖ్యమంత్రి’ వార్తలపై రేవంత్ స్పందన ఎలా ఉన్నదంటే?