
movie shooting

రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వువులు జారీ చేసినట్టు రాష్ట్ర ఫిల్మ్, టివి, థియోటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునే అనుమతులు తమ సంస్థ మంజూరు చేస్తుందని చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే అన్నారు. అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగష్టు 21న జారీ చేసిన మార్గదర్శకాలు మరియు స్టాండర్లు ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో ఈ మార్గదర్శకాలను మరియు స్టాండర్లు ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉందని, అయితే షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు.
- సినిమాల చిత్రీకరణ సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూనిట్లు, సెట్లు అన్నీ కూడా తరుచుగా శానిటైజేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.
- చేతులు కడుక్కనే సౌకర్యం లేని పక్షంలో అందరు టెక్నిషియన్లు, నటీ నటులు వ్యాండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాలని ఆయన తెలిపారు.
- సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితుల మినహా మిగిలిన సమయాల్లో టెక్నీషియన్లు అందరూ ఆరు అడుగుల దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు.
- కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరగం సందేశాన్ని చిత్ర ప్రదర్శన ప్రారంభం మరియు విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
- సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబంధనలు మరియు ఇతర వివరాలను రాష్ట్ర ఫిల్మ్ం, టివి, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in నుండి పొంద వచ్చని ఆయన తెలిపారు.